సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ దేశాన్ని ముక్కలు చేసేందుకు పాకిస్తాన్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటూ పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌కు చెందిన గజ్వే హింద్ ఆకాంక్షలను ప్రధాని మోదీ భగ్నం చేస్తే, రాహుల్ గాంధీ గజ్వే హింద్‌కు బాసటగా నిలిచారని మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు పాక్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటున్న రాహుల్ పౌర చట్టం, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్నాడని దుయ్యబ్టారు. కాగా విపక్షాలు దేశాన్ని చీల్చి అంతర్యుద్ధం జరగాలని కాంక్షిస్తున్నాయని గిరిరాజ్ సింగ్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్, కాంగ్రెస్, ఓవైసీ వంటి వారంతా భారత్‌ను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో అంతర్యుద్ధం జరగాలని ఆకాంక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓవైసీ పాక్ అజెండాను అమలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment