న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో సుపైడ్ బాంబర్లను(ఆత్మాహుతి దళాలు) తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘షాహిన్‌బాగ్‌లో జరిగేది కేవలం ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు శిక్షణ పొందుతున్నారు. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’’ అని గురువారం ట్విటర్‌లో తెలిపారు. షాహీన్‌బాగ్ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. (‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ముస్లింలు తీవ్ర ఆందళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు దీనిని కీలక ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారం కోసం బీజేపీ షాహీన్‌బాగ్‌పై మురికి రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్, ఆప్ మద్దతుతోనే ఆందోళనకారులు రహదారులను అడ్డగించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తాము అధికారంలోకి వచ్చాక శిబిరాన్ని తొలగిస్తామని బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు.
చదవండి : షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!
यह शाहीन बाग़ अब सिर्फ आंदोलन नही रह गया है ..यहाँ सूइसाइड बॉम्बर का जत्था बनाया जा रहा है।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 6, 2020
देश की राजधानी में देश के खिलाफ साजिश हो रही है। pic.twitter.com/NoD98Zfwpx
Comments
Please login to add a commentAdd a comment