నేనెడక్కడా దాక్కోలేదు: గిరిరాజ్ | I am not hiding, says Giriraj Singh | Sakshi
Sakshi News home page

నేనెడక్కడా దాక్కోలేదు: గిరిరాజ్

Published Wed, Apr 23 2014 5:35 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

నేనెడక్కడా దాక్కోలేదు: గిరిరాజ్ - Sakshi

నేనెడక్కడా దాక్కోలేదు: గిరిరాజ్

న్యూఢిల్లీ: తానెడక్కడా దాక్కోలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. రేపులో కోర్టులో లొంగిపోనున్నట్టు వెల్లడించారు. నరేంద్ర మోడీకి అందరికంటే ముందు బహిరంగంగా మద్దతు పలికింది తానొక్కడినేనని ఆయన తెలిపారు. ఈరోజు కూడా తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అన్నారు. దేవుడు తన వెంటే ఉన్నాడని గిరిరాజ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆయనపై కొరడా ఝళిపించింది. బొకారో కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement