
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను దెయ్యంగా వర్ణించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆధునిక ఝాన్సీరాణిలా మమతా బెనర్జీ పోరాడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది గురువారం వ్యాఖ్యానించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలను ఆమె దీటుగా ఎదుర్కొంటున్నారని కితాబిచ్చారు. దీనిపై గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝాన్సీరాణితో మమతా బెనర్జీని పోల్చడం కంటే అవమానం మరోటి లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో ఆమెను పోల్చారు. సీబీఐతో మమతా బెనర్జీ వివాదం నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment