
రాహుల్.. తప్పిపోయిన విమానం లాంటివారు!
సోనియా గాంధీ మీద వ్యాఖ్యలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. తాజాగా రాహుల్ గాంధీ మీద మరో వ్యంగ్యాస్త్రం విసిరారు. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పినా.. ఈలోపే ఆయన మరోసారి వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. సముద్రంలో పడిపోయి గల్లంతై ఇప్పటి వరకు కానరాకుండా పోయిన మలేషియా విమానం లాగే.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆచూకీ కూడా తెలియడంలేదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు సోనియా, రాహుల్ గనక తన వ్యాఖ్యలకు నొచ్చుకుంటే.. క్షమాపణలు చెబుతున్నానని కూడా గిరిరాజ్ చెప్పారు. అయితే కాసేపటికే మళ్లీ రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయినా.. ఇంతవరకు రాహుల్ గాంధీ ఆచూకీ మాత్రం తెలియలేదని, అచ్చం ఇదేదో మలేసియా విమానం వ్యవహారంలాగే ఉందని ఆయన అన్నారు.