
మంత్రి మానసిక చికిత్సకు అయ్యే ఖర్చు నేను భరిస్తా!
పట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందునే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ అన్నారు. మంత్రి అనారోగ్యాన్ని ప్రభుత్వం నయం చేయించకపోతే ఏ మెంటల్ హాస్పిటల్‌లోనైనా చికిత్సకయ్యే ఖర్చు మొత్తం భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
గిరిరాజ్ సింగ్ వంటి వ్యక్తులతో సమాజానికి ప్రమాదమని, బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో ఆయన ఇంకా కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని బబ్బర్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సూర్యునిపై ఉమ్మేసే ప్రయత్నం లాంటిదేనని ఆయన ఎద్దేవా చేశారు.