
రోహింగ్యాలు : ప్రేముంటే.. తీసుకెళ్లండి?!
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- చట్టం, దేశం తరువాత మానవత్వమన్న మంత్రి
- దేశ భద్రతకు రోహింగ్యాలతో ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పడు ముందుండే కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్.. తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్‌కు తీసుకెళ్లండి.. అంటూ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తీసుకెళ్లవచ్చని’ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌లో మారణహోమం సృష్టిస్తున్నారు. అంతేకాక సరిహద్దుల్లో టెర్రరిస్టులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది దేశంలోకి ఇప్పటికే అక్రమంగా చొరబడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశానికి రోహింగ్యా చొరబాటుదారులను భరించే శక్తి లేదని.. వాళ్లంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు.
రోహింగ్యాలు అక్రమ వలసదారులే.. వారివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ మాటలను ఆయన సమర్ధించారు. చట్టం, దేశం కన్నా.. మానవత్వం పెద్దది కాదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉండే కొంతమంది నేతలు రోహింగ్యాలను సమర్థిస్తున్నారు.. రోహింగ్యాలతో పాటూ వాళ్లను కూడా పాకిస్తాన్ పంపితే సరిపోతుందని మరో వివాదాస్పద వ్యాఖ‍్య చేశారు. దేశంలో ప్రస్తుతం 14 వేల మంది రోహింగ్యాలు అక్రమంగా దేశంలో నివసిస్తున్నారని ప్రభుత్వం ఆగస్టు 9న పార్లమెంట్‌కు తెలిపిందని గిరిరాజ్ సింగ్ చెప్పారు.