Rohingyas
-
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచ్చిలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు..ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశ్మీర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
రాష్ట్రాలకు ఆ అధికారం లేదు
సాక్షి, హైదరాబాద్: రోహింగ్యాలను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు వెంటనే వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విదేశీయుల చట్టంలోని 3(2)(జీ) ప్రకారం రాష్ట్రాలకు ఆ అధికారం లేదని పేర్కొంది. అధికారులు జారీ చేసిన 541, 538, 593, 540, జీవోలను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. చర్లపల్లి జైలులో ఉన్న రెహముల్లా, జాఫర్ ఆలమ్ అలియాస్ మహమద్ సాజిద్, అబ్దుల్ అజీజ్, నూర్ కాసీం అలియాస్ మహ్మద్ నూర్, నాజర్ ఉల్ ఇస్లామ్‌లను విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో వారిని నిర్బంధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి దాఖలైన పిటిషన్లో తీర్పు ఇచ్చింది. కిందికోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ ఐదుగురిని నిర్బంధంలోనే ఉంచాలని డీజీపీ వినతి మేరకు ప్రభుత్వం వేర్వేరుగా 541, 538, 593, 540 జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో మొత్తం ఐదు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఉత్తర్వులు వెలువరించింది. అంతకుముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విదేశీయులను అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎంఏ షకీల్ వాదించారు. ఎక్కడున్నా ఓ నిర్ధిష్ట ప్రదేశంలోనే రోహింగ్యాలు ఉండేలా నియంత్రణ చేయవచ్చు.. కానీ, జైల్లో పెట్టడానికి వీల్లేదని నివేదించారు. ఒకవేళ వారిపై ఏమైనా కేసులు ఉంటే చట్ట ప్రకారం విచారణ చేయవచ్చని తెలిపారు. శ్రీలంక నుంచి అక్రమంగా వచ్చిన వారి విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్ధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక నిర్బంధ కేంద్రాలు లేనందున రోహింగ్యాలను విచారణ ఖైదీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జైళ్లల్లో ఉంచుతున్నామని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్ కుమార్ వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ‘‘పార్లమెంట్ సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు. -
నగరానికి రోహింగ్యాల రాక సాగుతోందిలా..
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాలు అనేక మంది ఉంటున్నారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలానే నగరానికి చేరుకుని, స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ ఫారూఖ్‌తో పాటు ఇతడికి సహకరించిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడు ఖదీరుద్దీన్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఫారూఖ్ విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల “ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది రోహింగ్యాలు ఆ దేశం విడిచిపెడుతున్నారు. వీటిలో అత్యధికులు భారత్‌కు వలస వస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా ప్రకటించుకుని ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు కార్డులు పొంది ఆశ్రయం పొందుతున్నారు. మరికొందరు అక్రమ మార్గంలో వచ్చి చేరుతున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతూ, పశ్చిమ బెంగాల్ వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడి మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో గుర్తింపుకార్డులు పొందుతూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మారుతున్నారు. ♦ మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. ♦ ఈ మార్గంలో ఎక్కడా తమ ఉనికి అక్కడి పోలీసులు, సాయుధ బలగాలకు తెలియకుండా చూసుకుంటున్నారు. దీనికోసం ప్రధానంగా తెల్లవారుజామున ప్రయాణం సాగిస్తున్నారు. ♦ మాంగ్డో నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నఫ్ నది తీరానికి వస్తున్న వీరికి ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు సహకరిస్తున్నారు. ♦ రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. ♦ ఆద్యంత అక్రమంగా సాగే ఈ ప్రయాణంలో అడుగడుగునా ఉండే దళారులు వీరికి సహకరిస్తున్నారు. దీనికోసం సమయం, అవసరం, అవకాశాలను బట్టి రేటుకట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ♦ టెక్నాఫ్ నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. ♦ అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుంటున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని, అక్కడ నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో చేరుతున్నారు. ♦ ఇక్కడ మరోసారి రంగంలోకి దిగే దళారులు వీరికి సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో దాచి ఉంచుతున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నదిని దాటిస్తూ భారత్‌లోకి పంపుతున్నారు. ♦ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్‌లకు వెళ్తున్నారు. ♦ ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులం అంటూ చెప్పుకుని తొలుత ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. ♦అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్
వాషింగ్టన్/లండన్/ఢాకా: కోవిడ్–19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్ కోవిడ్–19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పునః చర్చలకు ఇక ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడాలన్న ఆసక్తి కూడా తనకి లేదన్నారు. చైనాతో సంబంధాల అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని, అసలు పూర్తిగా సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే అమెరికాకు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయన్నారు. కోవిడ్‌పై సహకరించుకోవాలి: చైనా చైనాతో తెగదెంపులౖకైనా సిద్ధపడతానని ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆ దేశం ఆచితూచి స్పందించింది. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ఇరుదేశాల ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేసి, కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లో 5.80 లక్షల సర్జరీలు రద్దు? కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో 5 లక్షల 80 వేలకు పైగా సర్జరీలు రద్దు కావచ్చని, లేదంటే వాయిదా పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సర్జరీ భారత్‌లో శస్త్రచికిత్సలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల్లో కరోనా బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో తొలి కరోనా కేసు నమోదైంది. బంగ్లాలో రోహింగ్యాల శిబిరాలు అత్యంత రద్దీతో ఉంటాయి. కాక్స్ బజార్ జిల్లాలోని ఒక శిబిరంలో తలదాచుకుంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేపుతోంది. బంగ్లాలో వివిధ శరణార్థి శిబిరాల్లో 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. -
తబ్లిగీ : రోహింగ్యాల వేటలో పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?) ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మర్కజ్ యాత్రకు ఎవరైనా వెళ్ళారా? వారు మళ్లీ తిరిగి వచ్చారా?అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వచ్చందంగా బయటకు రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రోహింగ్యాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ తబ్లిగీ జమాత్‌కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది. మొన్న ఢిల్లీ ప్రార్థనలు, నిన్న యూపీలోని దేవ్‌బంద్‌కు తబ్లిగీ జమాత్‌కు లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఇప్పటికే మర్కజ్ వెళ్లినవారిని, తరువాత దేవ్‌బంద్‌కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానాతిప్పలు పడ్డ పోలీసులు.. ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు. అందుకే వెళ్లారా..? ఢిల్లీలో జరిగే తబ్లిగీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు. ఈ ప్రార్థనలకు హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళ్తుంటారు. మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు. రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు. అయితే, తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హరియాణాలోని మేవాట్‌లో జరిగిన జమాత్‌లో పాల్గొన్నారని సమాచారం. రోహింగ్యాలు వలస జీవులు. చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. రంజాన్ సమీపిస్తోన్న నేపథ్యంలో మేవాట్‌కు వచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీరంతా వెళ్లి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరు మేవాట్తోపాటు, నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేవాట్‌కు నిజాముద్దీన్‌కు మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా వీరు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. దక్షిణాదిన తెలంగాణలోనే అధికం మనదేశంలో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం, బెంగాల్, ఢిల్లీ, కశ్మీర్, దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు. వీరిని గుర్తించడం సులువే. కానీ, చాలామంది పాతబస్తీ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పటివరకు అందిన సమా చారం మేరకు నల్లగొండలో 14 మంది, హైదరాబాద్ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది. అందులో కూడా ఎవరైనా మిస్సయ్యారా? అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. -
దుబాయ్ లక్ష్యం.. పాతబస్తీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: తమ తమ మాతృదేశాలు విడిచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారీ స్కెచ్‌తోనే దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ల దేశంలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో దుబాయ్, గల్ఫ్‌లాంటి విదేశాలకు వెళ్లడానికి భారత్‌ను తాత్కాలిక వేదికగా మార్చుకుంటుండగా.. మరికొందరు ఇక్కడే స్థిరపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది మెరుగైన జీవితం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సులువుగా గుర్తింపు కార్డులు పొంది.. భారత పౌరులుగా చలామణీ అవుతున్నారు. కొందరు విదేశాల కు వెళ్లే యత్నాలు చేస్తుంటే. మరికొందరు ఇక్కడే సెటిలవుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దర ఖాస్తు చేసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. పాతబస్తీలో రూ.10కి ఓటరు కార్డు, రూ.200కు పాన్‌కార్డు, రూ.2,000కు పాస్ పోర్టు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారికి ఉగ్రనేపథ్యముంటే.. అది అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మంటగలుపుతుందని అధికారులు వాపోతున్నారు. దుబాయ్‌కి ప్రణాళికలు.. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వీరంతా పాతబస్తీ, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఖాళీస్థలాలు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు దీనిని పట్టించుకోవడం లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు తీసుకుంటూ భారత పౌరులకు దక్కాల్సిన పథకాలను కొట్టేస్తున్నారు. స్థానిక యువతతో స్నేహం చేస్తోన్న రోహింగ్యా, బంగ్లాదేశీ యువకులు మెల్లిగా పంథా మార్చారు. స్థానిక యువత దారిలోనే.. దుబాయ్, గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులు సంపాదిస్తున్నారు. విజిటింగ్ వీసా మీద అయినా సరే.. విదేశాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలుపెట్టారు. వారు విదేశీయులని తెలిసీ కొందరు ఏజెంట్లు సాయం చేస్తుండటం గమనార్హం. కసబ్‌కు దారం.. వీరికి ఆధార్! 2008లో దేశంలోకి అక్రమంగా చొరబడి చేతికి ఎర్రటి దారం కట్టుకుని ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన కసబ్‌ను భారత పౌరుడంటూ పాకిస్తాన్ ప్రపంచానికి చాటిచెప్పే యత్నం చేసింది. నగరంలో ఓటర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందిన రోహింగ్యాలు విదేశాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడితే.. భారత్ అంతర్జాతీయంగా తనమీద పడ్డ మచ్చను చెరిపేసుకోవడం చాలాకష్టమని, పలుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని పలువు రు అంటున్నారు. అమెరికా, యూరోప్ వంటి దేశాలకు రోహింగ్యాల వల్ల నష్టం కలిగితే.. భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టులను రద్దు చేయాల ని పాస్‌పోర్టు ఆఫీసులకు లేఖలు రాస్తున్నారు. ఉపాధి కోసమా.. ఉగ్రకోణమా? వాస్తవానికి ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా వారిని వెంటనే అరెస్టుచేసి, జైలుశిక్ష లేదా తిరిగి పంపించడం చేస్తారు. వీరంతా వేలసంఖ్యలో వచ్చిన శరణార్థులు కావడంతో ఎవరినీ తిరిగి పంపే ప్రయత్నాలు జరగలేదు. వీరిలో చాలామంది ఉగ్రవాద సానుభూతిపరు లున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భారత్ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు విదేశాలకు వెళ్తున్నారన్న విషయం వెలుగుచూడగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా వెళ్లేవారు భారత పౌరుల ముసుగులో అక్కడ ఏదైనా ఉగ్రచర్యలకు పాల్పడితే.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మంటగలిసే ప్రమాదముందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఆనాటి నుంచే సీఏఏ కశ్మీర్లో అమల్లోకి..
శ్రీనగర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం వచ్చే వీలు లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. త్వరలోనే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారుల శిక్షణా కార్యక్రమానికి జితేంద్ర సింగ్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన నాటి నుంచే జమ్మూ కశ్మీర్లో అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం రోహింగ్యాలకు భారత్‌లో ఉండేందుకు ఎటువంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ‘రోహింగ్యాలను ఎలా పంపించాలో కేంద్రం ఆలోచిస్తోంది. జాబితాలు తయారు చేస్తున్నాం. అవసరమైన చోట్ల బయోమెట్రిక్ గుర్తింంపు కార్డులు అందజేస్తాం. ఎందుకంటే సీఏఏ ప్రకారం రోహింగ్యాలు భారత్‌లో ఉండే అవకాశం లేదు. చట్టంలో పేర్కొన్న ఆరు మైనార్టీలో వీరి ప్రస్తావన లేదు. అంతేకాదు వీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కాదు. మయన్మార్ నుంచి వచ్చిన వాళ్లు గనుక వారు అక్కడికే వెళ్లిపోవాలి. అంతేకాదు వాళ్లు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌ను దాటుకుని జమ్మూ కశ్మీర్ వరకు ఎలా రాగలిగారన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.(ఎవరూ తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి) కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం జమ్మూ, సాంబా జిల్లాల్లో దాదాపు 13,700 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో రోహింగ్యాలతో పాటు పలువురు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. 2008 నుంచి 2016 మధ్య వీరి జనాభా ఆరు వేలకు పైగా పెరిగింది. ఇక డిసెంబరు 31, 2014 తర్వాత ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సీఏఏ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఓ వర్గం ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!) -
రోహింగ్యాల దారెటు?
-
రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రోహింగ్యాల వివరాలను సేకరిస్తున్నామని, రాష్ట్రంలో 6 వేల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఈ లెక్కలు తేలాయని, అందులో కొంత మందికి ఆధార్ కార్డులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మందగమనం విషయంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్ర బడ్జెట్ తగ్గిందని, బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం ఏర్పడిందంటూ అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం వచ్చిందనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఇది ఆర్థిక మాంద్యం కాదని, ఆర్థిక మందగమనమని పేర్కొన్నారు. కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని, రాష్ట్రం పాటించడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల వినియోగం తగ్గిందని, భారత ఆర్థిక వ్యవస్థపైనా కొంత ప్రభావం పడిందన్నారు. అందుకే వృద్ధి రేటు కొంత తగ్గిందని, వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. పెట్టుబడులు పెం చేందుకు అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. మూలధనం కింద బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇస్తున్నామని చెప్పారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచుతున్నామన్నారు. కార్పొరేట్ పారిశ్రామిక రంగానికి 10 శాతం పన్ను తగ్గించడం గత 20 ఏళ్లలో మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక మాం ద్యం నుంచి మన దేశాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంటేæ మన్మోహన్ సింగ్ హయాంలో 5.6 శాతం ఉందన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి జీడీపీ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉంటే నాలుగేళ్లలో 2.7 ట్రిలియ న్ డాలర్లకు చేరుకుందన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలకు బ్యాంకులు ఈ నగదును ఉపయోగించవచ్చని తెలిపారు. దేశ వ్యాప్తంగా సమస్యలపై పోలీసు, ఫైర్, మెడికల్, మహిళల వేధింపు లు తదితర అన్నింటిపై ఫిర్యాదు చేసేందుకు డయ ల్ 112 నంబర్ని తీసుకొస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. దానిని ఢిల్లీలో ప్రారంభించామని, ప్రయోగాత్మకంగా అక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డయల్ 100, 101 ఉండవన్నారు. -
2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ
కుటుపలోంగ్: మయన్మార్ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని కుటుపలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే మయన్మార్ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు. -
అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్ షా
న్యూఢిల్లీ : అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ)’ దేశంలోని ప్రతీ రాష్ట్రానికి వర్తింపజేస్తారా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. భారత పౌరులను గుర్తించే ఎన్నార్సీ విషయమై ప్రస్తుతం అసోంలో ఆందోళనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల హామీలో భాగంగా అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి బుధవారం రాజ్యసభలో ఎస్పీ ఎంపీ సంధించిన ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ.. ‘చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి అసోంలో ఎన్నార్సీ గురించి ఆందోళనలు జరిగిన సమయంలో ఆ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. దీనిని అనుసరించి అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అంతర్జాతీయ చట్టాలననుసరించి వారిని దేశం నుంచి వెళ్లగొడతాం. ఇది దేశంలోని ప్రతీ మూలలో, భారతదేశ మట్టిపై అక్రమంగా నివసిస్తున్న ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు. ఇక జూలై 31లోగా ఎన్నార్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. భారత పౌరుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసిన క్రమంలో ఇప్పటికే 25 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ కేంద్రానికి అందిందని.. అయితే ఇందులో ఉన్న బోగస్ అప్లికేషన్లు గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో చివరి తేదీని పొడగించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతామన్నారు. నిజమైన భారతీయ పౌరుడికి అన్యాయం జరుగకూడదనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా రోహింగ్యా ముస్లిం సంఖ్యకు సంబంధించి సమాధానమిస్తూ... దేశవ్యాప్తంగా వీరు వ్యాపించి ఉన్నారు, కాబట్టి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి డేటాను సేకరించేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. -
ఏడుగురు రోహింగ్యాలు వెనక్కి
న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమంగా నివాసముంటున్న ఏడుగురు రోహింగ్యాలను గురువారం భారత్ దేశం నుంచి పంపించివేసింది. వారి స్వదేశమైన మయన్మార్‌కు పంపించింది. భారత్‌నుంచి రోహింగ్యా ముస్లింలను పంపించేయడం ఇదే తొలిసారి. 2012లో వీరిని గుర్తించి విదేశీయుల చట్టం కింద అరెస్టు చేశారు. అప్పటి నుంచి వీరంతా అస్సాంలోని కచార్ జైల్లోనే ఉన్నారు. ‘ఏడుగురు మయన్మార్ దేశస్తులను నేడు భారత్ నుంచి బహిష్కరించాం. మయన్మార్–మణిపూర్ సరిహద్దుల్లోని మోరే వద్ద ఆ దేశ అధికారులకు వీరిని అప్పగించాం. మయన్మార్ దౌత్యవేత్తలు కూడా వీరిని తమ దేశస్తులుగా గుర్తించారు.ఈ ఏడుగురికి ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు’ అని అస్సాం అదనపు డీజీ భాస్కర్ మహంతా పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్ పచ్చజెండా: వీరిని పంపించే విషయంలో చివరి నిమిషం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమను పంపించేయవద్దంటూ ఈ ఏడుగురిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గురువారం ఉదయం ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా (26 నుంచి 32 ఏళ్ల లోపు వారే) అక్రమంగా భారత్‌లో ఉంటున్నందున పంపించాల్సిందేనని ఆదేశించింది. ‘వీరి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోం. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. మయన్మార్ కూడా వీరిని తమ పౌరులుగా గుర్తించింది’ అని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విడుదలైన తర్వాత వీరంతా అస్సాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశంలో 14వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపిందని గతేడాది ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల వివరాల ప్రకారం దేశంలో 40వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు ఉన్నారని తేలింది. -
మమత బెనర్జీకి అమిత్ షా హెచ్చరిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో దుర్గాదేవి నిమజ్జనానికి, పాఠశాలల్లో సరస్వతి పూజకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మమతా బెనర్జీపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే.. మమత అధికారాన్ని రోజుకో మెట్టు తగ్గిస్తామని హెచ్చరించారు. కోల్‌కతాలో శనివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో షా పాల్గొన్నారు. తృణమూల్‌ను కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘దుర్గాపూజ తర్వాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వరు. బెంగాల్‌లోని చాలా పాఠశాలల్లో సరస్వతి పూజ జరుపుకోకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి జరగాల్సిందేనా? బీజేపీ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. చొరబాటుదారులకు స్వాగతమా? మైనారిటీలను తృప్తిపరిచేందుకు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేసేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని షా ఆరోపించారు. ‘రాష్ట్రంలోకి రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు స్వాగతం పలుకుతారు. దీని ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారు? మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితి ఉంటుంది’ అని షా విమర్శించారు. ర్యాలీలో తన ప్రసంగం ప్రత్యక్షప్రసారం కాకుండా టీవీ చానళ్లకు మమత హెచ్చరికలు జారీచేశారన్నారు. ‘మా పార్టీ కార్యకర్తలపై నాకు అచంచల విశ్వాసముంది. వారు ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ వెళ్లి తృణమూల్ ఏం చేస్తోందో ప్రజలకు వివరిస్తారు’ అని స్పష్టం చేశారు. ఎన్నార్సీపై నోరు మెదపరే? అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)పై తమ విధానమేంటో మమత, రాహుల్‌లు సమాధానం ఇవ్వాలన్నారు. వీరిద్దరూ దేశం కోసం ఆలోచిస్తున్నారా? లేక ఓటుబ్యాంకు కోసమేనా అని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ ఎన్నార్సీపై తన అభిప్రాయాన్ని ఎందుకు వెల్లడించడం లేదు. ఆయనకు దేశభద్రత కన్నా ఓటు బ్యాంకే ముఖ్యమా?’ అని విమర్శించారు. అయితే, షా ర్యాలీ ఫ్లాప్ షో అని తృణమూల్ పేర్కొంది. ఎన్నార్సీ అమలు తీరుపైనే వ్యతిరేకం: కాంగ్రెస్ కోల్‌కతా: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)కి తాము వ్యతిరేకం కాదని, అస్సాంలో అది అమలైన తీరును మాత్రమే తప్పు పడుతున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎన్నార్సీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సర్వే గందరగోళంగా జరిగిందనటానికి మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖుల పేర్లు జాబితాలో గల్లంతు కావడమే ఉదాహరణ’ అని అన్నారు. ‘మేం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఎన్సార్సీని అమలు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని మోదీ ప్రభుత్వమే 2017లో సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి’ అని అన్నారు. -
100 మంది హిందువుల ఊచకోత
యాంగూన్, మయన్మార్ : వందలాది మంది హిందువుల(మయన్మార్‌లో హిందువులు కూడా మైనారిటీలే)ను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆమ్నెస్టీ బుధవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. మయన్మార్‌లో జాతుల(హిందువులు, రోహింగ్యాలు) మధ్య వైరాలను ఆమ్నెస్టీ రిపోర్టు తేటతెల్లం చేసింది. గతేడాది ఆగష్టు 25న పెద్ద ఎత్తున బౌద్ధులు, రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలపై విరుచుకుపడ్డారు. అదే రోజున రోహింగ్యా మిలిటెంట్లు సైతం హిందువుల ప్రాంతాలపై విరుచుకుపడి నరమేధం సృష్టించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఘటన వల్లే మయన్మార్ సైన్యం రంగంలోకి దిగిందని, దీంతో 7 లక్షల మంది రోహింగ్యాలు దిక్కతోచని స్థితిలో పొరుగుదేశాలకు వలస బాట పట్టారని వివరించింది. రోహింగ్యా జాతిని అంతమొందించేందుకు బర్మా సైన్యం వారిపై పౌరుల హత్య, గ్రామాలకు నిప్పుపెట్టడం వంటి ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రోహింగ్యా మిలిటెంట్లపై సైతం పలు ఆరోపణలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. హిందువుల కుటుంబాలపై దాడులు జరిపిన రోహింగ్యా మిలిటెంట్లు 53 మందిని ఉరి తీసినట్లు వెల్లడించింది. రఖైన్ రాష్ట్ర ఉత్తరభాగాన ఉన్న ఓ శ్మశానవాటికలో హిందువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) పేర్కొంది. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది రోహింగ్యా మిలిటెంట్లేనని ఆమ్నెస్టీ పరిశోధనలో తేలింది. మరో గ్రామంలో కూడా 46 మంది హిందువులు మిస్సయ్యారని వారిని ఏఆర్ఎస్ఏ మిలిటెంట్లే హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చదవండి : 400 మంది ముస్లింలు ఊచకోత -
ఫేస్‌బుక్‌పై యూఎన్ తీవ్ర మండిపాటు
జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్య ముస్లింల విషయంలో ఫేస్బుక్ వ్యవహరించిన తీరును అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తప్పుబట్టింది. రోహింగ్యాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి ఫేస్బుక్ వారధిగా ఉపయోగపడిందని మండిపడింది. మయన్మార్‌లో పర్యటించిన అంతర్జాతీయ నిజ నిర్ధారణ కమిటీకి చైర్మన్‌గా ఉన్న మార్జుకి దారుస్మాన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అక్కడి పరిస్థితులను నిర్ణయించిందని తెలిపారు. ఆ సమయంలో మయన్మార్‌లో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. భద్రత దళాల దాడుల వల్ల 65వేల మంది రోహింగ్యాలు గత ఆగస్టులో బంగ్లాదేశ్‌కు తరలిపోయారని, అలాంటి పరిస్థితుల్లో కూడా రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో వ్యాప్తి చెందుతున్న వివాదస్పద సమాచారాన్ని తొలగించడానికి మాత్రం ఆ కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒకప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మృగంగా మారిందని కమిటీ పరిశీలకురాలు యంగీ లీ కూడా వ్యాఖ్యానించారు. మయన్మార్‌లో దాడులకు ఫేస్బుక్ ప్రచారమే కారణమని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వ్యాప్తికి ఫేస్బుక్ దోహదపడిందన్నారు. మయన్మార్ రోహింగ్యాలపై మిలటరీ దాడులకు తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. గతంలో ఇలాంటి వార్తలపై స్పందించిన ఫేస్బుక్, తాజా వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అమ్మా వెళుతున్నా
ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ‘అమ్మా వెళ్లొస్తా’ అంటాం.దేశం విడిచి వెళుతున్నప్పుడు ‘అమ్మా వెళుతున్నా’ అని మాత్రమే అనగలం!మయన్మార్‌ను రాత్రికి రాత్రి సైన్యం తుపాకీ మొనల మీద విడిచిపెట్టిన ఏడు లక్షలమంది రోహింగ్యాలు రుధిరాశ్రువుల మధ్య బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నారు.సెల్ఫోన్లలో షూట్ చేసుకుని వచ్చిన తమ ఇళ్లను, ఊరిని చూసుకుంటూ అదే పెద్ద ఊరటగా బతుకు ఈడుస్తున్నారు. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం... గడపలో నాటుకున్న మొక్కను వదిలిపెట్టాలి. గంప కింద పెట్టి పొదువుకున్న కోడిపిల్లలను వదిలిపెట్టాలి. నాన్న గతంలో కొనిచ్చిన పాత సైకిల్‌ను వదిలిపెట్టాలి. అమ్మ ఆ అరుగు మీదే కూర్చుని కబుర్లు చెప్పేదనే జ్ఞాపకం వదిలిపెట్టాలి. ఇంటిని, ఇరుగూ పొరుగును, మామా బాబాయ్ పిలుపులను, తెలిసినవారి నుంచి అడక్కుండానే వచ్చే కూర సువాసనను, శుక్రవారం పూట కలిసి నడిచి పంచుకున్న అత్తరు పరిమళాన్ని, అంత వరకూ బతికిన బతుకును, అంతవరకూ పెంచుకున్న పాశాన్ని, అంత వరకూ ముద్దాడిన మట్టిని, అంతవరకూ నీడనిచ్చిన మబ్బు తుంటని వదిలి పెట్టి కదలాలి. ఎక్కడికి? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ అగమ్యంగా అగోచరంగా పర దేశానికి. తల్లి తండ్రులు లేనివాడు అనాథే. కాని మాతృదేశం కోల్పోయినవాడు నిజమైన అనాథ. ఇవాళ ఏడు లక్షల మంది రోహింగ్యాలు అనాథలయ్యారు. నేలను రుద్ది రుద్ది వేసే అడుగులు, ఛాతీలోకి పీల్చి పీల్చి అందుకునే శ్వాస, అశ్రువులను జార్చి జార్చి కార్చే కన్నీరు, వెనక్కు తిరిగి తిరిగి చూసే ఆఖరి చూపులు... వీటితో వాళ్లు బిడారులుగా నడిచి, కఠినమైన నీటి కత్తుల మీద నడిచి, ఛిద్రం చేసే బుల్లెట్ల వానకు దడిచి, దురదృష్టవశాత్తు బతికి, అంతం లేని వేదనను భుజాన మూటగా మోస్తూ తమ పొరుగు దేశం బంగ్లాదేశ్ చేరుకున్నారు. ఆగస్టు 2017 నుంచి సాగుతున్న ఈ ఉప్పు కన్నీటి వలస సాగుతోంది సాగుతూనే ఉంది... బహుశా మయన్మార్ తన సైనిక హింసను చివరి రోహింగ్యాను మట్టుపెట్టేంత వరకూ కొనసాగిస్తే సాగుతూనే ఉంటుంది. కంచె చేను మేసింది... ప్రజలను కాపాడటం ప్రభుత్వాల పని. ప్రజలను రక్షించడం సైనికుల విధి. కాని మయన్మార్‌లో ప్రభుత్వం, సైనికులు రోహింగ్యాలపై పగ పెంచుకున్నాయి. వీరు తమ దేశంవారు, తమ మతం వారు కాదన్న నెపంతో జాతి హననానికి తుపాకులు ఎక్కు పెట్టాయి. ఆడవాళ్లని, పిల్లలని చూడకుండా శవాల వరుసను పరిచాయి. వాన కురుస్తున్నా, రాత్రి మంచు పళ్లతో కరుస్తున్నా, ఎండ మింగుతున్నా ఎక్కడా వాళ్లను నిలువనీయకుండా సరిహద్దులు దాటేంతవరకూ నిర్దాక్షిణ్యంగా నిర్దయగా విష పడగలతో తరిమిపెట్టాయి. కాని ప్రతి మనిషీ జ్ఞాపకాల బందీ. ముఖ్యంగా తన జన్మస్థలానికి, జన్మించిన దేశానికి బందీ. వాటిని తనతో పాటు దాచుకోవాలని ప్రయత్నిస్తాడు. రోహింగ్యాలు కూడా ప్రయత్నించారు. వాళ్లను ఆ సమయంలో ఆదుకన్న ఒకే ఒక్క వస్తువు– సెల్‌ఫోన్. ఫోన్లో అపురూపం రోహింగ్యాలు తీరిగ్గా వలసకు బయల్దేరిన కాందిశీకులు కాదు. అప్పటికప్పుడు, రాత్రికి రాత్రి, ఎక్కడో పేలిన ఒక తుపాకీ చప్పుడుకు ఉలికి పడి, సైన్యం ఊడిపడి ఇళ్లు తగలబడుతుండగా ఆ మంటల్లో చెల్లాచెదురవుతున్న నల్లటి నీడల మధ్యన చేతికందిన వస్తువు తీసుకుని దేశం విడిచిపెట్టారు. అయితే ఎవరు ఏ వస్తువును మర్చిపోయినా ఎక్కువమంది మర్చిపోని వస్తువు సెల్‌ఫోనే. ఎందుకంటే దేశం విడిచిపెట్టే ముందు ఆఖరుసారిగా వారు తమ ఇంటిని, పరిసరాలను, ఊరిని సెల్లో బంధించుకుని అదే పెద్ద పెన్నిధిగా దేశం విడిచారు. ఎన్నో కష్టాలు పడి దేశం దాటారు. బంగ్లాదేశ్‌లో వారికి ఆసరా దొరికింది. కాందిశీకుల శిబిరాల్లో పట్టెడు అన్నం, పీడకలల నిద్ర మధ్య వారికి కాసింత సెల్‌ఫోనే ఊరట అయ్యింది. చాలామంది ఆ సెల్ఫోన్లో తమ సొంత ఇంటిని చూసుకుని గాఢమైన ఆలోచనలలో మునిగిపోతుంటారు. కొందరి కంట ఆ సమయంలో ధారాపాతం సంభవిస్తూ ఉంటుంది. ఎవరైనా విషాదంగా ఏదైనా పాట అందుకుంటారా? ఏమో. ఒక మనిషికి ఇంతకు మించిన శాపం వద్దు. ఇంత నాగరిక లోకం అని చెప్పుకుంటున్న ఈ ప్రపంచంలో ఒక జాతి జాతంతా చిన్నబుచ్చుకున్న ముఖాలతో మసలడం ఏం శోభ? కష్టాల డేగలు దేశం దాటాక కూడా రోహింగ్యాల కష్టాలు తీరలేదు. శిశు జనానాలూ వారి ఆయుష్షు పెద్ద ప్రశ్నార్థకం. వైద్య సహాయం పెద్ద ప్రశ్నార్థకం. మూడు పూటలా కడుపు నిండిందనిపించే తిండి ప్రశ్నార్థకం. ఆ తాత్కాలిక గుడారాలూ ఏ ఎండకూ వానకూ పనికి రావు. ఆకలి వారిలోని కొందరిని నిస్సహాయమైన రాక్షసత్వంలోకి, మోసంలోకి, వంచనలోకి, ఏం చేసైనాసరే మనుగడ కాపాడుకోవాలనే అధోస్థితిలోకి జార్చేసింది. దాంతో దొంగలుగా, మోసగాళ్లుగా, తార్పుడుగాళ్లుగా, కాసిన్ని చిల్లర పైసల కోసం మాదకద్రవ్యాలను చేరేవేసే ఏజెంట్లుగా మారిపోయారు. ఆడవాళ్లు అనుక్షణం తమను తాము కాపాడుకోవడానికి ‘రేప్ డివైస్’లను దగ్గర పెట్టుకోవాల్సి వస్తోంది. ఇంకా మానవ ఊహకు అందని నైచ్యాలు ఎన్ని జరుగుతున్నాయో ఎవరూ చెప్పలేరు. దారి తప్పినవారు ఏదో ఒకరోజు బాగుపడొచ్చు. దేశం తప్పినవారు ఎప్పటికీ మానవ విషాదాన్ని గొంతు నుంచి ఉమ్ముతూనే ఉంటారు. ఆ ఉమ్ము ఒకోసారి నీరు. మరోసారి రక్తం. రోహింగ్యా స్త్రీలు తమ దగ్గర ఉంచుకుంటున్న ‘రేప్ డివైజ్’. ఎవరైనా అత్యాచారం చేయబోయినప్పుడు దీన్ని నొక్కితే సైరన్ లాగా మోగి నలుగురికీ తెలియజేస్తుంది. బంగ్లాదేశ్ సహాయ శిబిరంలో సెల్ఫోన్లో తన మయన్మార్ ఇంటిని చూసుకుంటున్న రోహింగ్యా -
సరిహద్దు రక్షణ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం
కోల్‌కతా: రోహింగ్యాలు సహా దేశంలోకి వచ్చే అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య త్వరలోనే ఏకీకృత కమాండ్ నేతృత్వంలో ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్‌నాథ్ గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. కంచెలు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ సంస్థలు, రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర, రాష్ట్ర బలగాలతో 4,036 కి.మీ మేర ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏకీకృత కమాండ్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు భాగస్వాములుగా ఉంటారన్నారు. -
మరో గౌరవం కోల్పోయిన సూచీ
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల సమస్య కారణంగా ఆంగ్‌సాన్ సూచీ మరో గౌరవాన్ని కోల్పోయారు. సుప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్‌లో ‘జూనియర్ కామన్ రూమ్’ నుంచి ఆమె పేరును తొలగించారు. స్వదేశంలో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి ఆమె నిస్సహాయంగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సెయింట్ హ్యూస్ విద్యార్థులు సూచీ పేరును జూనియర్ కామన్ రూమ్ నుంచి తక్షణమే తొలగించడానికి అనుకూలంగా ఓటేశారు. ‘రాఖైన్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలను సూచీ ఖండించకపోవడం శోచనీయం. సూచీ మౌనాన్ని ఖండిస్తున్నాం’ అని విద్యార్థులు తీర్మానంలో పేర్కొన్నారు. సెయింట్ హ్యూస్ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి సూచీ ఫొటోను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. -
పడవ బోల్తా: 8మంది రోహింగ్యాల మృతి
ఢాక: అక్రమ వలసలు రావడానికి ప్రయత్నిస్తూ రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని వస్తున్న శరణార్థుల పడవ బోల్తా కొట్టిన ప్రమాదంలో 8మంది రొహింగ్యాలు మృతిచెందగా.. మరి కొంత మంది గల్లంతయ్యారు. బర్మా నుంచి బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా వస్తుండగా పడవ నీట మునిగింది. ఒకే పడవలో పెద్ద ఎత్తున శరణార్థులు కూర్చోవడంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బంగ్లాదేశ్ తీరంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. -
‘ఏ క్షణంలో అయినా నాగాలాండ్ మీద ఎటాక్’
కోహిమా : రోహింగ్యా అక్రమ వలసదారులతో దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని నాగాలాండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రోహింగ్యాలకు ఆయుధాలు అందించేలా బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలతో దిమాపూర్ ఇమామ్ చర్చలు జరిపినట్లు నాగాలాండ్ నిఘా వర్గాలు తెలిపాయి. సుమారు 2 వేల మంది రోహింగ్యాలకు రహస్య ప్రదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. బలమైన ఆయుధాలతో కూడిన రోహింగ్యాలు ఏ క్షణంలో అయినా నాగాలాండ్ మీద విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి తెలిపాయి. ముఖ్యంగా నాగాలాండ్‌లోని హెబ్రాన్, ఖేచి క్యాంప్‌లపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని నాగాలాండ్ నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దులకు ఆవల ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరాలకు చేరుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు.. యువతకు మిలటరీ శిక్షణ ఇస్తున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (రిటైర్డ్) వీకే గౌర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద జమాత్‌ఘుద్ దవా, జమాత్ ఈ ఇస్లామీ, ఆల్‌ఖైదా, ఐఎస్ఐ వంటి సంస్థలు కూడా రోహింగ్య శరణార్థి శిబిరాల్లో ప్రవేశించాయని ఆయన తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
శరణార్థులు.. డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్
ఢాకా : మయన్మార్నుంచి బంగ్లాదేశ్‌కు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు రోహింగ్యాల ముస్లింలను, ఒక బంగ్లా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. మయన్మార్నుంచి బంగ్లాకు భారీగా రోహింగ్యా ముస్లింలు వలస వస్తున్న నేపథ్యంలో.. శరణార్థుల మాదిరిగానే కొందరు రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లోకి వచ్చిపోతూ.. మత్తుమందులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి శరణార్థులగా వస్తున్న ముగ్గురి దగ్గర.. 8 లక్షల మెథామెథమిన్ టాబ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ యేజర్ రవుల్ అమీన్ తెలిపారు. ఈ టాబ్లెట్స్‌లో కోకైన్ అధికంగా ఉండి.. మత్తును కలిగిస్తుంది. ఈ టాబ్లెట్స్‌ను బంగ్లాదేశ్ యువత అధికంగా వినియోగిస్తోంది. దీనిని అరికట్టేందుకు కొన్నేళ్లుగా బంగ్లదేశ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శరణార్థులగా మయన్మార్నుంచి బంగ్లాకు వస్తున్నవారిలో చాలామంది అక్రమంగా మత్తుపదార్థాలను రవాణా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా అదుపులోకి తీసుకున్నవారిలో ఒకరు పాత శరణార్థికాగా.. ఇద్దరు కొత్తగా బంగ్లాదేశ్‌కు వస్తున్న శరణార్థులని ఆయన చెప్పారు. -
విస్తరిస్తున్న రోహింగ్యాలు
శాటిలైట్ ఇమేజ్‌లో మరింత స్పష్టత క్యాంపుల్లోనూ.. పెరిగిన శరణార్థులు ఢాకా : మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులు దక్షిణ బంగ్లాదేశ్‌లో పూర్తిగా విస్తరిస్తున్నారు. ఇదే విషయాన్ని శాటిలైట్ చిత్రాలు కూడా ధృవీకరిస్తున్నాయి. రోహింగ్యాలు.. రాకముందు.. వచ్చిన తరువాత అంటూ.. తాజా కొన్ని చిత్రాలను డిజిటల్ గ్లోబ్ విడుదల చేసింది. శరణార్థులు లేని రోజుల్లో అంటే మే నెల్లో పరిస్థితులను.. ప్రస్తుతం నెలకొన్న స్థితిని ఈ చిత్రలు వివరిస్తాయి. మయన్మార్‌లోని ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రోహింగ్యా ముస్లింలు సుమారు 4 లక్షల 20 వేల మంది బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చారు. వీరు రాకముందు.. బంగ్లా దక్షిణ ప్రాంతం నిర్జనారణ్యంగా ఉండేదని.. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జనారణ్యంగా మారిందని.. కొలరాడోకు చెందిన సీనియర్ ఫొటో ఎనలిస్ట్ స్టీఫెన్ వుడ్ చెప్పారు. ఈ చిత్రాలను అంతరిక్షం నుంచి హై-రెజుల్యూషన్ కెమెరాలతో తీసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రోహింగ్యాలు ఉంటున్న ప్రాంతంలో ఒక భారీ ట్రాఫిక్ జామ్‌ను చూడొచ్చని.. ఇది శరణార్థులకు మౌలిక, ఆహార పదార్థాలను అందించే వాహనాలు అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. -
రోహింగ్యాలు శరణార్థులు కాదు: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలోని రోహింగ్యాలను మయన్మార్‌కు డీపోర్ట్ చేయాలన్న కేంద్రం వైఖరి మారబోదని ఆయన స్పష్టం చేశారు. 'రోహింగ్యాలు శరణార్థులు కాదు. వారు ఆశ్రయం కోరి దేశంలోకి రాలేదు. వారు అక్రమ వలసదారులు' అని ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి తీసుకోవడానికి మయన్మార్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. శరణార్థి హోదా పొందాలంటే ఒక ప్రక్రియ ఉంటుందని, ఈ ప్రక్రియను రోహింగ్యా వలసదారులు పాటించలేదన్నారు. 1951 ఐరాస శరణార్థి ఒప్పందంలో భారత్ సంతకం చేయలేదని, రోహింగ్యాలను మయన్మార్‌కు పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒడంబడికను ఉల్లంఘించడం లేదని చెప్పారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పుగా మారరని, అందుకే వారిని మయన్మార్‌కు తరలించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
రోహింగ్యాలు : ప్రేముంటే.. తీసుకెళ్లండి?!
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చట్టం, దేశం తరువాత మానవత్వమన్న మంత్రి దేశ భద్రతకు రోహింగ్యాలతో ముప్పు సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పడు ముందుండే కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్.. తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్‌కు తీసుకెళ్లండి.. అంటూ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తీసుకెళ్లవచ్చని’ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో మారణహోమం సృష్టిస్తున్నారు. అంతేకాక సరిహద్దుల్లో టెర్రరిస్టులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది దేశంలోకి ఇప్పటికే అక్రమంగా చొరబడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశానికి రోహింగ్యా చొరబాటుదారులను భరించే శక్తి లేదని.. వాళ్లంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రోహింగ్యాలు అక్రమ వలసదారులే.. వారివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ మాటలను ఆయన సమర్ధించారు. చట్టం, దేశం కన్నా.. మానవత్వం పెద్దది కాదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉండే కొంతమంది నేతలు రోహింగ్యాలను సమర్థిస్తున్నారు.. రోహింగ్యాలతో పాటూ వాళ్లను కూడా పాకిస్తాన్ పంపితే సరిపోతుందని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రస్తుతం 14 వేల మంది రోహింగ్యాలు అక్రమంగా దేశంలో నివసిస్తున్నారని ప్రభుత్వం ఆగస్టు 9న పార్లమెంట్‌కు తెలిపిందని గిరిరాజ్ సింగ్ చెప్పారు. -
రొహింగ్యాల రోదన వినపడదా!
రెండో మాట 40 వేలమంది రొహింగ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు. మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి. ‘ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ జాతి అయినా హింసకు, ఆకలి దప్పులకు, అవమానాలకు మతం పేరుతోనో, అభిప్రాయభేదాల పేరుతోనో గురైతే మిగతా మానవులు వారి పక్షాన నిలబడడమే నిజమైన పౌరధర్మం.’ – పాలీ వీజిల్ (నోబెల్ బహుమతి గ్రహీత వీజిల్ యూదు జాతీయుడు. జర్మనీలో యూదుల పట్ల సాగిన కిరాతకాలకు ప్రత్యక్ష సాక్షి. ‘నైట్’ అన్న రచనలో ఆయన ఈ మాటలు రాశారు.) ‘చిట్టచివరి బాధాతప్తుడైన మానవుడు విమోచన పొందేవరకు విశ్రమించబోనని గాంధీజీ పదే పదే చెప్పేవారు. నేడు మయన్మార్‌లో శతాబ్దాల తరబడి నివసిస్తున్న రొహింగ్యా ముస్లింలు అక్కడి ప్రభుత్వం నుంచి, సైనిక కిరాతకాల నుంచి ఎదుర్కొంటున్న హింసాకాండ ఫలితంగా ఇరుగు పొరుగు దేశాలకు వలసబాట పట్టవలసి వచ్చినవారు, గాంధీ చెప్పిన ఆ ‘చివరి మానవుడు’ కోవకు చెందినవారే. వీరు ప్రపంచంలోనే అత్యంత పీడన, దోపిడీలకు, కిరాతకాలకు, అణచివేతకు గురవుతున్న మైనారిటీ ముస్లింలు. వీరిని బానిసలుగా వెట్టి చాకిరీ వైపు మయన్మార్ సైన్యం, ప్రభుత్వం నెట్టాయి. ఈ నరమేధంలో దారితప్పి సంకుచిత జాతీయవాదాన్ని ఆశ్రయించిన బౌద్ధమతస్తులు కూడా పాల్గొనడం విచిత్రం’. – ప్రొ. శివవిశ్వనాథన్ (జిందాల్ విశ్వవిద్యాలయం, గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్, 6–9–17) ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ అణగారిన ఆర్తులలో ఒకరిగా, అనుభవిం చిన కిరాతకాలకు సమాధానంగా అణచివేతపై ఎవరు ఎందుకు ఎప్పుడు తిరగబడలవలసి వస్తుందో పాత్రోచితంగా ప్రేక్షకులకు చూపిస్తాడు. అలాగే ప్రాచీనకాలంలో స్పార్టకస్, నవీన యుగంలో షెగువేరా అణచివేతలకు సమాధానంగా కనిపిస్తారు. తెలుగుప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం రాజ్యపాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా పాలకుల మీద తిరగబడవలసి వచ్చింది. దారుణ జీవన పరిస్థితుల మధ్య, శతాబ్దాల వలస చరిత్ర నుంచి సంక్రమించిన భారాన్ని మోస్తూ కనీసం పౌరసత్వానికి కూడా నోచుకోని దశలో మయన్మార్ రొహింగ్యాలు సైన్యం మీద తిరగబడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దుర్భర స్థితిలో రొహింగ్యాలు ఇలాంటి తిరుగుబాటుకు కూడా పాలకులు ‘ఉగ్రవాద’ ముద్ర వేసి రొహిం గ్యాలను తరిమి కొడుతున్నారు. దీనితో ఇరుగు పొరుగు దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్‌లకు లక్షలాది మంది తరలిపోవలసి వచ్చింది. రొహింగ్యాలను బెంగాల్లో రొహింగులు అని, మయన్మార్ (నాటి బర్మా)లో జోహింగాలు అని పిలుస్తారు. ఈస్టిండియా కంపెనీ పాలకులు (1799 నాటికి) రూయింగాలుగా పేర్కొన్న ఈ ముస్లిం మైనారిటీలు ప్రస్తుతం మయన్మార్‌లో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ వీరి సమస్యను బీజేపీ పాలకుల మాదిరిగా నేటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఉగ్రవాదం ఫలితం’గా చూడడం లేదు. రొహింగ్యా ప్రజా బాహుళ్యాన్ని ఉగ్రవాదులుగా భావించడాన్ని ఖండించారు కూడా. నిజానికి బ్రిటిష్ ఇండియా కాలంలో ఇక్కడ నుంచి కూడా పొట్ట కూటికోసం, ఉపాధి కోసం బర్మాకు వలస వెళ్లడం గురించి కూడా మనకు తెలుసు. మయన్మార్‌లోని ఆరకాన్ రాష్ట్రం, ఉత్తర భాగాన్ని రఖినీ పేరుతో వ్యవహరించేవారు. అలా 15వ శతాబ్దం నాటికే బెంగాలీలు ఆరకాన్ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నిజానికి చారిత్రక ఆధారాలను బట్టి 8వ శతాబ్దం నుంచే రొహింగ్యా జాతి తెగలు ఉనికిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కాలంలో వారిని ఆర్కనీస్ ఇండియన్లు అని పిలిచేవారు. ఆనాటి నుంచి వీరికి స్థిర నివాసం లేక, ఒక దేశానికి చెందినవారిగా గుర్తింపు లేకుండా ఉండిపోయారు. 2016–17లలో జాతి వివక్ష సంక్షోభం ముదిరే సమయానికి రొహింగ్యా జనాభా పది లక్షలని అంచనా. వాస్తవానికి 8వ శతాబ్దానికి ముస్లిములే మెజారిటీ వర్గీయులు కాగా, హిందువులు మైనారిటీలుగా ఉన్నారని వికీపీడియా చెబుతోంది. ఇది 2013 నాటికి మారింది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వేధింపులకు, అవమానాలకు గురైన మైనారిటీలుగా రొహింగ్యాలను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలా వీరి సమస్య ప్రపంచం దృష్టికి తెచ్చింది. అయితే శతాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ రొహింగ్యాలకు మయన్మార్‌లో ఎందుకు పౌరసత్వం దక్కలేదో కూడా సమితి వివరించవలసి వచ్చింది. 1982లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బర్మీస్ పౌరసత్వ చట్టం రొహింగ్యాలకు ఆ హక్కును నిరాకరించింది. నోరు విప్పని నోబెల్ శాంతి దూత అన్నింటికన్నా దారుణమైన విషయం ఒకటి ఉంది. మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి, అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధానికి గురైన ఆంగ్–సాన్ సూకీని స్వీడిష్ అకాడమీ నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసింది. కానీ సూకీ ఆ స్ఫూర్తిని మరిచి దేశాధినేతగా రొహింగ్యాల ఊచకోతలను నిరోధించలేక పోతున్నారు. సైనిక నాయకత్వంతోపాటు తన ఉనికి కోసం ముస్లిం మైనారిటీలను ‘ఉగ్రవాదులు’గా ముద్ర వేశారు. రొహిం గ్యాలపై మయన్మార్ పాలక శక్తులు సాగిస్తున్న పైశాచిక దాడుల్ని ఐక్యరాజ్య సమితి ఖండించాల్సి వచ్చింది. అక్కడి మానవ హక్కుల పరిస్థితిని వర్ణిస్తూ సమితి ప్రత్యేక ప్రతినిధి, సంధానకర్త ప్రొఫెసర్ యాంఘీ–లీ ముస్లిం మైనారిటీల దుస్థితిని ఇలా వర్ణించాల్సి వచ్చింది (4.9.17): ‘‘ఈ రోజునే కాదు, రొహింగ్యాలను మూకుమ్మడిగా మయన్మార్ నుంచి బలవంతంగా తొలగించే కార్యక్రమం చాలాకాలంగా కొనసాగుతోంది. ముస్లింలకు సైన్యం దాడులవల్ల కల్పించిన ఈ దుస్థితివల్లనే వారు తిరగబడ్డారు. రఖినీ (ఆరకాన్) రాష్ట్రంలో వంద కిలోమీటర్ల పర్యంతం వ్యాపించి ఉన్న రొహింగ్యాల గ్రామాలను ఖాళీ చేయించి సైన్యం ఆ గ్రామాలను తగులబెట్టింది, వేలాదిమందిని చంపేసింది. నేడు రఖినీ రాష్ట్రం ఉడికిపోతూ తీవ్రవాదం రూపం దాల్చింది. 2012 నుంచీ ఈ పరిస్థితుల్లోనే ముస్లిం మైనారిటీలు జీవించవలసి వచ్చింది. వారికి సంచార స్వేచ్ఛ లేదు, అతి మౌలికమైన సేవలు పొందే స్వాతంత్య్రమూ లేదు. వివక్షాపూరిత చట్టాల మధ్యనే రొహింగ్యాలు దశాబ్దాల తరబడి జీవిస్తూ వచ్చారు. అలాంటి దారుణ పరిస్థితుల్లోనే ఎవరైనా సరే ‘లక్ష్మ ణరేఖ’ను దాటి వ్యవహరించడం తేలికే గదా!’’ (4.9.17). అందుకే ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, తర్వాత సమితి తరఫున మయన్మార్‌లో పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించిన కోఫీ అన్నాన్ కూడా మయన్మార్ సంక్షోభం తీవ్రవాదం వైపు పోకుండా ఉండాలంటే రొహింగ్యాలకు పౌరసత్వం కల్పించి తీరాలి అని సూచించారు. అయితే, సమితి కమిషన్ నివేదిక వెలువడిన (ఆగస్టు 24) 24 గంటల్లోనే సైన్యం రొహింగ్యాలపై ఆకస్మికంగా విరుచుకుపడింది. ఇది హిందువులకు, రొహింగ్యా ముస్లిం మైనారిటీలకు మధ్య అంతర్యుద్ధంగా మారింది. ఈ పరిస్థితుల్లో మన భారత పాలకుల ధోరణి రోజుకొక తీరుగా మారుతూ వచ్చింది. ప్రధాని మోదీ నేప్యీతా నగరంలో (మయన్మార్ పర్యటనలో) సూకీని సెప్టెం బర్ 6న కలుసుకున్నప్పుడు రొహింగ్యాల సమస్యను కేవలం సూకీ తరహాలోనే ‘ఉగ్రవాద హింసాకాండ’ దృష్టితోనే పరిశీలించారు. ప్రభుత్వ మారణకాండను తప్పించుకుంటూ 40 వేలమంది రొహిం గ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు. కాగా, మయన్మార్ సంక్షోభం ముదిరి ఐక్యరాజ్యసమితి సూకీ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ ప్రకటనలు విడుదలవుతున్న సంగతి గమనించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ‘రొహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లి అక్కడే ఉంటే వారికి ఇండియా సహాయం అందిస్తుంద’ని ప్రకటించారు. ఎందుకంటే, అస్సాంకు బంగ్లాతో 262 కిలోమీటర్ల సరిహద్దు ఉండటమేగాక, ఈశాన్య భారతంలోని మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లతో కూడా సరిహద్దులున్నాయి. బహుశా అందుకే బీజేపీ పాలనలో ఉన్న అస్సాం, మణిపూర్ ప్రభుత్వాలను ‘రొహింగ్యా ముస్లిములు సరిహద్దు దాటి ప్రవేశించే పక్షంలో వెనక్కి నెట్టేయండి’ అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది (15.9.17). పరస్పర విరుద్ధ విధానాలు మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి. ఎవరు ఏ దేశం వారైనా, ఏ ఇబ్బందుల్లోనైనా మరొక దేశ ప్రభుత్వం నిరంకుశమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలు తమపై విధించిన సమయంలోనే– అలాంటి వారికి మన దేశం ఆశ్రయం కల్పించిందా లేదా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారత ఉపఖండ విభజన తర్వాత ఇండియా–పాకిస్తాన్‌లుగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్లో భాగమైన తూర్పు పాకిస్తాన్‌ను ప్రధాని ఇందిరాగాంధీ విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా– ఎన్ని వేలు, లక్షలమంది కాందిశీకులై పశ్చిమ బెంగాల్ సహా మరెన్ని భారత రాష్ట్రాల్లో ప్రవేశిం చలేదు? బాధల్లో ఉన్న ఎంతమందికి మనం ఆశ్రయం ఇవ్వలేదు? కశ్మీర్ సమస్యవల్ల ఎంతమంది కాందిశీకులయ్యారు? బంగ్లాదేశ్ ఏర్పాటు ఫలి తంగా మరికొందరు ముస్లిం మైనారిటీలు భారతదేశానికే కాదు, మయన్మార్‌కు సైతం పెద్ద సంఖ్యలో శరణార్థులైపోయారా లేదా? అలాగే శతాబ్దాల తరబడి బర్మా సమాజంలో అంతర్భాగమైపోయిన రొహింగ్యా ముస్లింలను భాగం కాదంటే కుదరదు గదా! కానీ, సిరియా, సూడాన్ ఆంతరంగిక సంక్షోభాలతో కాందిశీకులై వెడుతున్న ప్రజల్ని రావద్దని అడ్డుకుంటున్న పశ్చిమ దేశాల ప్రభుత్వాల్ని విమర్శించగల స్థితిలో మనం ఉన్నామా? మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ మాటల్లో చెప్పాలంటే ‘‘వోల్గా తీరంనుంచి గంగానదీ తీరం దాకా సాగిన మానవ వలసలన్నీ (వోల్గా–సే–గంగా) చరిత్రలో అంతర్భాగమేగానీ వేరు కాదని గుర్తించవలసిన ఘడియలు మరొకసారి వచ్చాయి. ‘వసుదైక కుటుం బాన్ని’ నిత్యం గుర్తుచేసే ఉపనిషత్ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు
ఢాకా : మయన్మార్ నుంచి వలస వచ్చిన 4 లక్షల రోహింగ్యా శరణార్థుల కోసం 14 వేల తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ శనివారం ప్రకటించింది. మయన్మార్‌కు సరిహద్దు ప్రాంతమైన కుటుపాలోంగ్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని బంగ్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ షా కమల్ చెప్పారు. ఈ షెల్టర్లలోనే 4 లక్షల రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటూ.. తాగునీరు, ఆహార, శానిటేషన్, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో షెల్టర్‌లో 6 నుంచి 10 కుటుంబాలు ఆవాసం ఉంటాయన్నారు. -
బర్మా నుంచి భారతీయులే పారిపోయి వస్తే...
న్యూఢిల్లీ: నాటి బర్మా నేటి మయన్మార్‌లో కొనసాగుతున్న జాతి విద్వేష దాడులకు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రోహింగ్యా మైనారిటీ జాతి ముస్లింలు నలుదిక్కులా పరుగులు తీస్తున్నారు. అటు బంగ్లాదేశ్, ఇటు మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి వచ్చి తలదాచుకుంటున్నారు. ఆశ్రయం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా బ్రతిమాలాడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి నాడు భారతీయులకు కూడా దాపురించింది. బర్మా దేశీయులు తమ దేశం నుంచి తరిమి కొడితే ఉష్ణమండల అడవుల్లో నుంచి లక్షలాది మంది భారతీయులు పారిపోయి వచ్చారు. వారిలో వేలాది మంది మార్గమధ్యంలో ప్రాణాలు వదిలారు. 1826లో బర్మా, బ్రిటిష్ పాలకుల మధ్య జరిగిన యుద్ధంలో బర్మా ఓడిపోయింది. 1855 నాటికి ఆ దేశాన్ని బ్రిటిష్ పాలకులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి బర్మాలోకి భారతీయుల వలస ప్రారంభమైంది. 1985 నాటికి బర్మా జనాభాలో ఏడు శాతం మంది భారతీయులు ఉన్నారు. ముందుగా వ్యాపార కార్యకలాపాల కోసం శెట్టియార్, మర్వారీ, గుజరాతీలు బర్మాకు వలసపోయారు. బెంగాల్ డెల్టా ప్రాంతం నుంచి బెంగాల్ బాబులు కూడా అక్కడికి వలసపోయారు. ఆ తర్వాత సామాన్య ప్రజలు వలసపోయి కార్మికులుగా, కూలీలుగా స్థిరపడ్డారు. ఇళ్లలో వంట మనుషులుగా, పనివాళ్లుగా కూడా స్థిరపడ్డారు. బర్మా ఇంటి యజమానులకు బర్మా భాష రాకపోయినా ఫర్వాలేదుగానీ, భారతీయ వంటవాళ్లతో మాట్లాడేందుకు కనీసం ‘కిచెన్ ఉర్దూ’ అయినా రావాలని ప్రముఖ రచయిత జార్జి ఆర్వెల్ వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరారు. ‘దేవదాసు’ లాంటి చిత్ర కథలను అందించిన ప్రముఖ భారత కథా రచయిత శరత్ ఛంద్ర ఛటోపాధ్యాయ కూడా బర్మాలో పలు ఉద్యోగాలు చేశారు. ముందుగా రైల్వేలో పనిచేసిన ఆయన అకౌంటెంట్‌గా, గుమాస్తాగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. బర్మాకు వలసపోయిన వారిలో తెలుగువారు కూడా ఎక్కువగానే ఉన్నారు. తెలుగువారితో ఘర్షణ.. బర్మా రాజధాని రంగూన్ ఓడ రేవులో 1930లో బర్మీయులకు, తెలుగువారికి మధ్య తొలిసారిగా ఘర్షణ జరిగింది. ఆ తర్వాత 1938లో పెద్ద ఎత్తున జరిగిన అల్లర్లలో వేలాది మంది భారతీయులు మరణించారు. రంగూన్‌లోనే ఎక్కువగా అప్పుడు భారతీయులకు వ్యతిరేకంగా జాతి విద్వేష దాడులు లేదా ఘర్షణలు జరగడానికి కారణం రంగూన్లో ఎక్కువ మంది భారతీయులు ధనవంతులు కావడమే. రంగూన్ మున్సిపల్ పన్నుల్లో 55 శాతం పన్నులను భారతీయులు చెల్లిస్తుండగా, బర్మ దేశీయులు కేవలం 11 శాతం పన్నులు చెల్లించేవారు. మిగతా పన్నులను ఇతర జాతులు, దేశస్థులు చెల్లించేవారు. భారతీయులను వారు అప్పుడు కాలా (నలుపు) అని, కోలా అని పిలిచేవారు. బర్మా భాషలో కోలా అంటే విదేశీయుడు అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా.. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ బర్మాపై దాడి చేసింది. బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గింది. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు భాగం అవడం వల్ల అటు జపాన్ దాడులను, మరోపక్క స్థానిక బర్మా ప్రజల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బర్మా నుంచి భారతీయులు ప్రాణభీతితో వెనక్కి రావడం 1930లో ప్రారంభమై 1960వ దశకం వరకు కొనసాగింది. 1948లో బర్మాకు బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం రావడంతో భారతీయులపై దాడులు మరింత తీవ్రమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా బర్మాలో పది లక్షల మంది భారతీయులు ఉండగా, అది 1950 నాటికి ఏడు లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు మూడు లక్షల మంది భారతీయులు భారత్‌కు తిరుగుబాట పట్టారు. 1962లో సైనిక ప్రభుత్వం కఠిన వైఖరి 1949 నుంచి 1961 మధ్య తమకు బర్మా వారసత్వాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ 1,50,000 మంది భారతీయులు అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చే సుకున్నారు. వారిలో తమ అవసరాన్ని,వృత్తి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఐదోవంతు భారతీయులకు మాత్రమే బర్మా ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. 1962లో బర్మాలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. వలస చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి సైనిక నియంతనే విన్, భారతీయులతోపాటు వివిధ మైనారిటీ జాతుల ఆస్తులను జాతీయం చేశారు. వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో 1962 నుంచి 1964 మధ్య దాదాపు మూడు లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చారు. ఐదు లక్షల మంది భారతీయులకు.. బర్మా ప్రభుత్వం 1982లో మరింత కఠినమైన పౌరసత్వాన్ని తీసుకొచ్చింది. దీంతో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగతోపాటు భారతీయులు కూడా ఏ దేశానికి చెందిన వారయ్యారు. ప్రతి పౌరుడు మాత భాష బర్మానే మాట్లాడాలి, బర్మాలోనే విద్యాభ్యాసం కొనసాగించాలి. ఉద్యోగ వ్యవహారాలను బర్మాలోనే నిర్వహించాలనే కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్న రోహింగ్య ముస్లింలు గతేడాది చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని బర్మా జాతీయులపై తిరుగుబాటు లేవనెత్తారు. ఫలితంగా సైనిక దాడుల్లో వేలాది మంది రోహింగ్యాలు మరణిస్తుండగా, లక్షలాది మంది బంగ్లా, భారత దేశాలకు పారిపోయి వస్తున్నారు. నాడేం చేయలేదు, నేడేమీ చేయడం లేదు బర్మాలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని 1960వ దశకంలో బర్మా భారతీయుల నుంచే కాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. బర్మాలో అప్పుడు నివసిస్తున్న చైనీయుల రక్షణకు చైనా ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఈ విమర్శలకు ఆస్కారమైంది. ఇప్పటికి కూడా బర్మాలో ఐదు లక్షల మంది భారతీయులు ఉంటారన్నది అనధికార అంచనా. భారత్ వచ్చిన రోహింగ్యలను వెనక్కి పంపిస్తున్న ప్రస్తుత భారత ప్రభుత్వం, భారతీయులు వస్తే వారికి ఆశ్రయం ఇస్తుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. -
రోహింగ్యాలను భారత్ ఎందుకు రానివ్వడం లేదు!
న్యూఢిల్లీ: మయాన్మార్లో రోహింగ్యా ముస్లిం తెగ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు వారి వలస కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలోని రోహింగ్యా ప్రజలను తిరిగి స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోహింగ్యాలను డిపోర్ట్ చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? తదితర వివరాలివి.. రోహింగ్యాలు ఎవరు? మయన్మార్‌లోని పురాతన జాతులలో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగ ఒకటి. కానీ, 1982లో మయన్మార్ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు. దీంతో, వారికి పౌరసత్వాన్ని నిరాకరించినట్టయింది. రోహింగ్యాలను 'బెంగాలీ'లుగా మయన్మార్ ప్రభుత్వం ముద్రవేస్తోంది. ఇటీవలికాలంలోనే బంగ్లాదేశ్ నుంచి రఖినె రాష్ట్రంలోకి రోహింగ్యాలు వలస వచ్చారని చెప్తోంది. మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు. ఎంతమంది ఉన్నారు? మయన్మార్‌లో దాదాపు 10లక్షలమంది రోహింగ్యాలు ఉన్నారు గత ఆగస్టు 25 నుంచి 1.23 లక్షలమంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిపోయారు. జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, హరియాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో దాదాపు 40వేలమంది రోహింగ్యాలు నివసిస్తున్నారు. భారత్‌లో శరణార్థుల చట్టం లేదు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు 1951లో ఐరాస తీసుకొచ్చిన తీర్మానంపైగానీ, 1967నాటి ప్రోటోకాల్పైగానీ భారత్ సంతకం చేయలేదు. కేసు టు కేసు ప్రాతిపదికన తాత్కాలిక పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది శరణార్థుల అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదిస్తే.. వారికి దీర్ఘకాలిక వీసా (ఎల్టీవీ)ని అందజేస్తుంది. ఏడాదికోసారి ఈ వీసాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీవీ పొందేవారు దేశంలోని ప్రైవేటు సెక్టార్లో పనిచేయవచ్చు. బ్యాంకింగ్, విద్య వంటి సదుపాయాలు పొందొచ్చు. కానీ, శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్! భారత్‌లో శరణార్థుల చట్టం లేకపోయినా.. అనేకమంది బాధితులకు భారత్ ఆశ్రయం కల్పించింది. టిబేటన్లు, బంగ్లాదేశ్‌కు చెందిన చక్మాస్లు, అఫ్గాన్లు, శ్రీలంకకు చెందిన తమిళులకు భారత్ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. లక్షమంది టిబేటన్లు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ల్యాండ్ లీజు తీసుకోవడంతోపాటు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తమిళనాడులో శ్రీలంక శరణార్థులు లక్షకుపైగానే ఉన్నారు. ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారు. ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు దేశంలో నివసించేందుకు వీలుగా భూ కొనుగోలుకు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఆధార్ కార్డులు పొందేందుకు 2016లో మోదీ ప్రభుత్వం అనుమతించింది. రోహింగ్యాలపై ప్రభుత్వం ఏమంటోంది? దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులందరినీ స్వదేశాలకు పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ఎందుకంటే.. ఉగ్రవాద గ్రూపుల రిక్రూట్మెంట్కు వలసదారులు ఉపయోగపడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. వలసదారులు భారతీయ పౌరుల హక్కులను దెబ్బతీయడమే కాకుండా.. భద్రతకు తీవ్ర సవాలుగా పరిణమిస్తున్నారు. వలసదారులు పోటెత్తుతుండటం వల్ల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సవాళ్లు తలెత్తుతున్నాయి. ఈ వలస వల్ల జనాభాపరంగా భారత భౌగోళిక ముఖచిత్రం మారిపోతోంది. రోహింగ్యాలను పంపడం సాధ్యమేనా? రోహింగ్యాలను తిరిగి వెనుకకు తీసుకోవాలని భారత్ బంగ్లాదేశ్, మయన్మార్‌లతో చర్చలు జరుపుతున్నా.. అసలు రోహింగ్యాలది తమ దేశమే కాదని, వారికి పౌరసత్వమే లేదని మయన్మార్ వాదిస్తుండటంతో ఇది కష్టసాధ్యంగా మారింది.