కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఐటీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా అలాగే ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగుల వేతనాలను పెంచకపోగా.. మరి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా 'ఇన్ఫోసిస్' (Infosys) ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో చాలా మంది ఎంప్లాయిస్ సంస్థను వీడి వెళ్లినట్లు తెలిసింది.
నిజానికి కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఐటీ సంస్థలు కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. ఈ కారణంగానే స్వల్ప లాభాలను పొందగలుగుతున్నాయి. ఇన్ఫోసిస్ నికర లాభం, ఆదాయం వంటివి మునుపటికంటే కూడా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ 2023 ఏప్రిల్ & జూన్ సమయంలో ఏకంగా 6,940 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం సంస్థలో 3,36,294 మంది ఉన్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)
ఇన్ఫోసిస్‌లో మాత్రమే కాకుండా విప్రోలో 8812 మంది, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో 2506 మంది ఉద్యోగులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే టీసీఎస్ సంస్థలో 523 మంది కొత్త ఉద్యోగులు చేరినట్లు సమాచారం. అంతే కాకుండా ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాల పెంపులో కూడా కొంత వాయిదా వేసింది. ఈ బాటలోనే మరి కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా ఉద్యోగులు తగ్గడానికి కారణం అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment