Q3 company results
-
ఇన్ఫోసిస్ నుంచి వేల మంది - ఐటీ ఉద్యోగుల్లో..
కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఐటీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా అలాగే ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగుల వేతనాలను పెంచకపోగా.. మరి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా 'ఇన్ఫోసిస్' (Infosys) ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో చాలా మంది ఎంప్లాయిస్ సంస్థను వీడి వెళ్లినట్లు తెలిసింది. నిజానికి కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఐటీ సంస్థలు కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. ఈ కారణంగానే స్వల్ప లాభాలను పొందగలుగుతున్నాయి. ఇన్ఫోసిస్ నికర లాభం, ఆదాయం వంటివి మునుపటికంటే కూడా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ 2023 ఏప్రిల్ & జూన్ సమయంలో ఏకంగా 6,940 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం సంస్థలో 3,36,294 మంది ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) ఇన్ఫోసిస్‌లో మాత్రమే కాకుండా విప్రోలో 8812 మంది, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో 2506 మంది ఉద్యోగులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే టీసీఎస్ సంస్థలో 523 మంది కొత్త ఉద్యోగులు చేరినట్లు సమాచారం. అంతే కాకుండా ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాల పెంపులో కూడా కొంత వాయిదా వేసింది. ఈ బాటలోనే మరి కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా ఉద్యోగులు తగ్గడానికి కారణం అని తెలుస్తోంది. -
ప్రాఫిట్ 10 వేల కోట్లు!!
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 9,420 కోట్లు. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రిలయన్స్ ఆదాయం 56 శాతం ఎగిసి రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఇటు దేశానికి అటు వాటాదారులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రిలయన్స్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక త్రైమాసికంలో ఏకంగా రూ. 10,000 కోట్ల లాభాల మైలురాయిని దాటిన తొలి దేశీ ప్రైవేట్ కంపెనీగా నిల్చింది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ సవాళ్లు ఎదురైనప్పటికీ.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ మొత్తం లాభదాయకత మెరుగుపడటంలో వీటి పాత్ర కూడా పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు. క్యూ3లో రిలయన్స్ నగదు నిల్వలు స్వల్పంగా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ పెట్టుబడి ప్రణాళిక పూర్తి కావడంతో 2018 డిసెంబర్ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763. రిఫైనింగ్ మార్జిన్ డౌన్ .. రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదైంది. అయితే, రిఫైనింగ్ విభాగం ఆదాయాలు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. ముడి చమురును ఇంధనంగా మార్చే రిఫైనింగ్ ప్రక్రియకు సంబంధించిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) ప్రతి బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది. ఇది 15 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 9.5 డాలర్లుగా ఉండగా, 2017 క్యూ3లో ఇది 11.6 డాలర్లు. ఉత్పత్తి తగ్గుదల కొనసాగడం.. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు నష్టాలు రూ. 185 కోట్లకు తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 480 కోట్లు కాగా, 2017–18 మూడో త్రైమాసికంలో రూ. 291 కోట్లు. జియో లాభం 65 శాతం అప్.. టెలికం విభాగమైన రిలయన్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 65 శాతం ఎగిసి రూ. 831 కోట్లకు చేరాయి. నిర్వహణ ఆదాయం 50.9 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయం రూ. 6,879 కోట్లు కాగా, లాభం రూ. 504 కోట్లు. సగటున యూజర్‌పై వచ్చే ఆదాయం 15.5 శాతం క్షీణించి రూ. 154 నుంచి రూ. 130కి తగ్గింది. అయితే, కస్టమర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్లకు పెరగడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ’ప్రస్తుతం జియో కుటుంబ సభ్యుల సంఖ్య 28 కోట్లకు చేరింది. అందుబాటు ధరలో అత్యంత నాణ్య మైన సర్వీసులతో అందర్నీ అనుసంధానించాలన్న మా లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్ గా ఎదుగుతోంది. గృహాలు, కంపెనీల్లోనూ కనెక్టివిటీకి కొత్త తరం ఎఫ్‌టీటీఎక్స్ సర్వీసులనుపై కసరత్తు చేస్తున్నాం ’ అని అంబానీ చెప్పారు. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి 864 కోట్ల గిగాబైట్స్కి చేరింది. సగటున ప్రతి యూజరు డేటా వినియోగం 9.6 జీబీ నుంచి 10.8 జీబీకి చేరింది. రిలయన్స్ రిటైల్ లాభం రూ. 1,680 కోట్లు.. పండుగ సీజన్ అమ్మకాలు, కొత్త స్టోర్స్ ప్రారంభం మొదలైన సానుకూల అంశాల ఊతంతో రిలయన్స్ రిటైల్ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది. రిలయన్స్ రిటైల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,400 పైచిలుకు నగరాలు, పట్టణాల్లో 9,907 స్టోర్స్ ఉన్నాయి. క్యూ3లో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శించారని సంస్థ తెలిపింది. నిత్యావసరాలు విక్రయించే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని వివరించింది. ఇక ఫ్యాషన్.. లైఫ్‌స్టయిల్ విభాగంలో కొత్తగా 100 స్టోర్స్ ప్రారంభించామని, దీంతో కొత్తగా మరో 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించినట్లయిందని పేర్కొంది. రిలయన్స్ జ్యుయెల్స్ విభాగం 100 స్టోర్స్ మైలురాయి దాటింది. స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం 57 నగరాల్లో 109కి చేరింది. ప్రైవేట్‌లో టాప్.. రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయి దాటిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ అంతా ఒకే క్వార్టర్లో అందుకోవడంతో అప్పట్లో ఐవోసీ ఈస్థాయి లాభాలు ప్రకటించడం సాధ్యపడింది. మిగతా క్వార్టర్స్‌లో నష్టాలు రావడంతో 2012–13 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఐవోసీ రూ. 5,005 కోట్ల లాభాలు నమోదు చేయగలిగింది. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు 0.30 పైసలు క్షీణించి రూ. 1,133.75 వద్ద క్లోజయ్యింది. -
టీసీఎస్ రికార్డు లాభాలు..
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) బంపర్ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8 శాతం వృద్ధితో రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు ఎగిసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైందని కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్లతో పోలిస్తే లాభం 2.6 శాతం పెరిగింది. ఆదాయం 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.8 శాతం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయాల వృద్ధికి ఉత్తర అమెరికా మార్కెట్ ఊతంగా నిలవగా, అటు కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం పనితీరు కూడా దోహదపడింది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది. డిజిటల్ 52 శాతం వృద్ధి.. డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ మొత్తం ఆదాయాల్లో డిజిటల్ వ్యాపార విభాగం వాటా అత్యధికంగా 30.1 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం 8.6 శాతం, ఎనర్జీ యుటిలిటీస్ 18 శాతం వృద్ధి సాధించాయి. అటు ప్రాంతాల వారీగా చూస్తే బ్రిటన్‌లో ఆదాయాలు 25.1%, మిగతా యూరప్ దేశాల్లో ఆదాయాలు 17.6% మేర పెరిగాయి. ఆసియా పసిఫిక్ వ్యాపార విభాగం 12.6%, ఉత్తర అమెరికా 8.2%, భారత్ 9.7%, లాటిన్ అమెరికా వ్యాపార విభాగం 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు.. టీసీఎస్ క్యూ3లో 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో బీఎఫ్ఎస్ విభాగం వాటా 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, రిటైల్ విభాగం వాటా 800 మిలియన్ డాలర్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైచిలుకు కాంట్రాక్టు ఒకటి దక్కించుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు కొన్ని ప్రధాన మార్కెట్లలో నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగినప్పటికీ నిర్వహణ మార్జిన్లను కాపాడుకోగలిగామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.రామకృష్ణన్ తెలిపారు. ఆదాయాలను పెంచుకునే దిశగా కార్యకలాపాలను విస్తరించడం, భవిష్యత్ వృద్ధి సాధనాలపై పెట్టుబడిపైనే టీసీఎస్ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. కొత్త ఆర్డర్ల డిమాండ్‌కి తగ్గట్లుగా మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి రావడంతో.. మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని రామకృష్ణన్ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ క్యూ3లో 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 25.6%కి చేరింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, సబ్–కాంట్రాక్టుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. ఆశావహంగా కొత్త ఏడాది.. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కీలకమైన విభాగాలన్నీ మెరుగైన పనితీరు కనపర్చడంతో 2018లో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి.. 14 త్రైమాసికాల గరిష్టం‘ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. పటిష్టమైన ఆర్డర్ బుక్, క్లయింట్స్, డిజిటల్ సేవల వృద్ధి, భారీ కొత్త ఆర్డర్లు వంటివి టీసీఎస్ సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారాయన. దీంతో కొత్త ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని రాజేష్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. ‘డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు సాధించాం. మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోబోతున్నాం. వీటి ఊతంతో కొత్త సంవత్సరం ఆశావహంగా ఉండబోతోంది‘ అని ఆయన తెలిపారు. తమ క్లయింట్లు.. ఐటీ వ్యయాల్లో కోత విధించే సూచనలేమీ కనిపించలేదని, అయితే మార్చి క్వార్టర్ మధ్యలో మాత్రమే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు సాధించేంతగా టీసీఎస్ పటిష్టమైన స్థితిలో ఉందని గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, యూరప్ దేశాలు, బ్రిటన్‌లో ఆర్థిక సేవల విభాగం కొంత మందగించవచ్చని, రిటైల్ విభాగం ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యూ3 ముగిసేనాటికి కంపెనీ చేతిలో రూ. 43,000 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉన్నాయని గోపీనాథన్ చెప్పారు. తమ వ్యూహాలకు అనువైన సంస్థల కొనుగోలు అవకాశాల అన్వేషణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 6వేల పైచిలుకు నియామకాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నికరంగా 6,827 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వార్షికంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 27,049 మేర పెరిగినట్లయింది. గడిచిన పన్నెండు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఐటీ పరిశ్రమతో పోలిస్తే అత్యల్పంగా 11.2 శాతంగా ఉంది. 2,92,000 మందికి డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణనిచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. టీసీఎస్ షేరు గురువారం బీఎస్ఈలో 0.02 శాతం పెరిగి రూ. 1,888.15 వద్ద క్లోజయ్యింది. -
కొనసాగిన రికార్డు
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ మరో గరిష్ట ముగింపును సాధించింది. 36 పాయింట్లు లాభపడి 21,374 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 7 పాయింట్లు పెరిగి 6,346 వద్ద నిలిచింది. సెన్సెక్స్ బుధవారం 87 పాయింట్లు పుంజుకోవడం ద్వారా తొలిసారి చరిత్రాత్మక గరిష్ట స్థాయి 21,338 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే 2013 డిసెంబర్ 9న నమోదైన ఇంట్రాడే గరిష్టం 21,483 పాయింట్లను అందుకోవలసి ఉంది. ఇక అదే రోజు సాధించిన 6,364 రికార్డుకు నిఫ్టీ చేరువగా రావడం గమనార్హం. కాగా, గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2% స్థాయిలో బలపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్అండ్టీ, యాక్సిస్, గెయిల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, భారతీ 3-1.5% మధ్య లాభపడగా, ఎంఅండ్ఎం 3% పతనమైంది. ఈ బాటలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, టాటా స్టీల్ 1% స్థాయిలో నష్టపోయాయి. ఇక ఎఫ్ఐఐలు నికరంగా రూ. 434 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 394 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.