కొనసాగిన రికార్డు | Strong corporate results take Sensex to new high | Sakshi
Sakshi News home page

కొనసాగిన రికార్డు

Published Fri, Jan 24 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

కొనసాగిన రికార్డు

కొనసాగిన రికార్డు

ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ మరో గరిష్ట ముగింపును సాధించింది. 36 పాయింట్లు లాభపడి 21,374 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 7 పాయింట్లు పెరిగి 6,346 వద్ద నిలిచింది. సెన్సెక్స్ బుధవారం 87 పాయింట్లు పుంజుకోవడం ద్వారా తొలిసారి చరిత్రాత్మక గరిష్ట స్థాయి 21,338 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే 2013 డిసెంబర్ 9న నమోదైన ఇంట్రాడే గరిష్టం 21,483 పాయింట్లను అందుకోవలసి ఉంది.
 
 ఇక అదే రోజు సాధించిన 6,364 రికార్డుకు నిఫ్టీ చేరువగా రావడం గమనార్హం. కాగా, గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2% స్థాయిలో బలపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, గెయిల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ 3-1.5% మధ్య లాభపడగా, ఎంఅండ్‌ఎం 3% పతనమైంది. ఈ బాటలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, టాటా స్టీల్ 1% స్థాయిలో నష్టపోయాయి. ఇక ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 434 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 394 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement