India stock markets
-
మూడు రోజుల నష్టాలకు చెక్
మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అయితే రోజంతా ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ సాగింది. చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 27,061 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లు పెరిగి 8,106 వద్ద స్థిరపడింది.జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి, ఆగస్ట్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లు ముగిశాక వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి పుంజుకోవడంతో సెంటిమెంట్ మెరుగుపడినట్లు చెప్పారు. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న పాలసీ సమీక్షపై అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని నిపుణులు పేర్కొన్నారు. కాగా, వారం మొత్తానికి 34 పాయింట్లు పెరగడం ద్వారా సెన్సెక్స్ వరుసగా ఐదో వారం లాభాలతో ముగిసనట్లయ్యింది. కొత్త గరిష్టానికి సిప్లా సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 6.5 జంప్ చేసి రూ. 613 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా, మారుతీ, భారతీ, ఐటీసీ, సెసాస్టెరిలైట్, హీరోమోటో, హెచ్డీఎఫ్సీ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, సన్ ఫార్మా 2%పైగా నష్టపోయాయి. ఈ బాటలో టాటా పవర్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, భెల్ 1.5-1% మధ్య డీలాపడ్డాయి. ఇక యథాప్రకారం చిన్న షేర ్లకు డిమాండ్ కొనసాగింది. ట్రేడైన షేర్లలో 1,742 పురోగమిస్తే, 1,312 నష్టపోయాయి. ఇక గురువారం రూ. 434 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 183 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
కొనసాగిన రికార్డు
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ మరో గరిష్ట ముగింపును సాధించింది. 36 పాయింట్లు లాభపడి 21,374 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 7 పాయింట్లు పెరిగి 6,346 వద్ద నిలిచింది. సెన్సెక్స్ బుధవారం 87 పాయింట్లు పుంజుకోవడం ద్వారా తొలిసారి చరిత్రాత్మక గరిష్ట స్థాయి 21,338 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే 2013 డిసెంబర్ 9న నమోదైన ఇంట్రాడే గరిష్టం 21,483 పాయింట్లను అందుకోవలసి ఉంది. ఇక అదే రోజు సాధించిన 6,364 రికార్డుకు నిఫ్టీ చేరువగా రావడం గమనార్హం. కాగా, గురువారం ట్రేడింగ్లో ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2% స్థాయిలో బలపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్అండ్టీ, యాక్సిస్, గెయిల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, భారతీ 3-1.5% మధ్య లాభపడగా, ఎంఅండ్ఎం 3% పతనమైంది. ఈ బాటలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, టాటా స్టీల్ 1% స్థాయిలో నష్టపోయాయి. ఇక ఎఫ్ఐఐలు నికరంగా రూ. 434 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 394 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.