ప్రముఖ ఐటీ సంస్థ 'విప్రో' (Wipro) తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెడ్‌గా భారతీయ ఐటీ దిగ్గజం మాజీ డెలాయిట్ ఎగ్జిక్యూటివ్ 'బ్రిజేష్ సింగ్'ను ఎంపిక చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో అంతటా AI అడాప్షన్‌ను వేగవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు.
బ్రిజేష్ సింగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ స్పేస్‌లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఈయన గతంలో డెలాయిట్‌లో సీనియర్ భాగస్వామిగా, డేటా-లీడ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నడపడంలో బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. లింక్డ్‌ఇన్ ప్రకారం ఈయన BIT సింద్రీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Wipro ai360 ప్రారంభించిన తర్వాత సింగ్ నియామకం జరిగింది. కావున దీని అభివృద్ధికి ఈయన కొత్త వ్యూహాలు రచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ మొత్తం పోర్ట్‌ఫోలియోను వేగవంతం చేసే సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా ఆయన ప్రధాన పోషించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment