ఐటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని కేంద్రం ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) ఓ నివేదికను విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం.. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ ఐటి ఎగుమతుల విలువ రూ. 986 కోట్లు ఉండగా.. 2022-23 నాటికి ఎగుమతులు గణనీయంగా పెరిగి రూ. 1867 కోట్లకు చేరుకున్నాయని స్టెపి నివేదిక తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతులు 90 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది.
అవకాశాల వెల్లువ
ఇక 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగులు 14527 మంది ఉండగా.. 2022-23 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగుల 24719 కి పెరిగారు. గత 4 ఏళ్లలో వేలాది మంది ఉపాధి పొందారు. దీనికి తోడు కొత్తగా ప్రారంభమైన ఇన్ఫోసిస్‌తో పాటు విస్తరిస్తున్న ఐటీ కంపెనీల 2023-24 సంవత్సరంలో ఏపీ ఐటి ఎగుమతులు మరో 20శాతం పెరగనున్నట్లు అంచనా. తద్వారా వేల ఐటీ ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.
విశాఖ పెట్టుబడలు వరద
విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి టీసీఎస్,హెచ్‌సీఎల్,యాక్సెంచర్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో విశాఖ ఐటీ హబ్‌గా అవతరించనుంది.
హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు
ఇక రాష్ట్రంలో ఐటీ ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ పెరుగుతుండడం విద్యార్ధులకు, నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక అనిశ్చితి, తొలగింపులు వంటి క్లిష్ట సమయాల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లో వృద్ది సాధించడంపై ఐటీ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment