
సాక్షి, తాడేపల్లి: నిజాలంటే సీఎం చంద్రబాబుకి భయమని అన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఏన్డీయే అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్యామల ఎక్స్ వేదికగా స్పందించారు.
నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే.. వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో టీసీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు బయటపెట్టారు. సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది అంటూ విమర్శలు సంధించారు.
నిజాలంటే @ncbn గారికి భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. వైజాగ్లో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే @ysjagan గారు విశాఖలో టీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు… pic.twitter.com/VNfu2gQ1u0
— Are Syamala (@AreSyamala) October 10, 2024