58402 గృహాలు, 23.93 ఆఫీస్‌ స్పేస్‌!  | 58402 households, 23.93 office space | Sakshi
Sakshi News home page

58402 గృహాలు, 23.93 ఆఫీస్‌ స్పేస్‌! 

Published Sat, Mar 2 2019 12:38 AM | Last Updated on Sat, Mar 2 2019 12:38 AM

58402 households, 23.93 office space - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్ధ క్రితం వరకూ మన దేశంలో రియల్టీ మార్కెట్‌ను ముంబై, ఎన్‌సీఆర్‌ ఉత్తరాది నగరాలు శాసించేవి. కానీ, దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలల్లో ఐటీ హబ్‌ ఎంట్రీతో మన దేశంతో పాటూ విదేశీ ఇన్వెస్టర్లను లాగిపడేశాయి. భౌగోళిక స్వరూపం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలు, స్థలాలు, స్థానికంగా బలమైన ప్రభుత్వ నిర్ణయాలతో ఈ మూడు నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుందని వెస్టియన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ఆసియా పసిఫిక్‌ సీఈఓ శ్రీనివాస్‌ రావు తెలిపారు. 

►2018లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 23.93 మిలియన్‌ చ.అ. కార్యాలయాల లావాదేవీలు జరిగాయి. ఇందులో 58 శాతం అంటే 13.83 మిలియన్‌ చ.అ. లావాదేవీలు బెంగళూరులో జరగ్గా.. హైదరాబాద్‌లో 27 శాతం, చెన్నైలో 15 శాతం జరిగాయి. 

► 2018లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతూ వచ్చింది. క్యూ4లో బెంగళూరులో 2.7 మిలియన్‌ చ.అ. లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 2.6 మిలియన్‌ చ.అ. లీజింగ్‌లు జరిగాయి. క్యూ3తో పోలిస్తే ఇది 40 శాతం వృద్ధి. 

​​​​​​​► ఈ మూడు నగరాల్లో 2018లో కొత్తగా 14.74 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో బెంగళూరులో 7.52 మిలియన్‌ చ.అ. (51 శాతం) వాటా కాగా.. హైదరాబాద్‌ 31 శాతం, చెన్నై 18 శాతం వాటా ఉంది. నగరంలో క్యూ4లో 2 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌.. అది కూడా గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఈ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. 

ఏడాదిలో 58,402 గృహాలు.. 
2018లో హైదరా బాద్, బెంగళూ రు, చెన్నై నగరాల్లో 58,402 గృహాలు ప్రారంభమయ్యా యి. ఇందులో 49% అంటే 28,676 యూని ట్లు బెంగళూరులో లాంచింగ్‌ కాగా.. హైదరాబాద్‌లో 25%, చెన్నైలో 26% ప్రారంభమ య్యాయి. ఇందులో ఎక్కువగా రూ.35–80 లక్షల లోపు ధర ఉన్న అఫడబుల్, మధ్య స్థాయి గృహాలే ఎక్కువగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement