
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికాలో తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇలినాయిస్ రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనితో 2024 నాటికి కొత్తగా 1,200 ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇల్లినాయిస్‌లో టీసీఎస్‌కు 3,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ వంటి క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment