
సప్లయ్ చైన్ సాస్ స్టార్టప్ 'ఓ4ఎస్' సాంకేతికతను మరింత బలోపేతం చేయడానికి, విస్తృతంగా వ్యాపార లక్ష్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సీనియర్ లీడర్‌షిప్ టీమ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇటీవలే ప్రశాంత్ వాఘేలాను ఐటీ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
సాఫ్ట్ వేర్ రంగంలో 17ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రశాంత్ ఈకామర్స్, ఫార్మా, ఎడ్యూటెక్‌తో పాటు డెలాయిట్, జీఎస్‌కే ,యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉందని ఓ4ఎస్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ4ఎస్ వ్యవస్థాపకుడు దివయ్ కుమార్ మాట్లాడుతూ..“ఓ4ఎస్ కుటుంబంలో ప్రశాంత్‌ను స్వాగతిస్తున్నాం.వచ్చే మూడేళ్లలో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కంపెనీ మార్కెటింగ్, సేల్స్, ప్రోడక్ట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి విభిన్న వర్టికల్స్‌లో బృందాన్ని విస్తరించాలని భావిస‍్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment