Infosys To Acquire Denmark-based BASE Life Science For 110 Million Euros - Sakshi
Sakshi News home page

Infosys: టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చేతికి డెన్మార్క్‌ సంస్థ!

Published Thu, Jul 14 2022 6:58 AM | Last Updated on Thu, Jul 14 2022 8:47 AM

Infosys To Acquire Denmark Based Base Life - Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో పట్టున్న డెన్మార్క్‌ కంపెనీ బేస్‌(బీఏఎస్‌ఈ) లైఫ్‌ సైన్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి నగదు రూపేణా 11 కోట్ల యూరోలు(రూ. 875 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. 

ఈ కొనుగోలు ద్వారా లైఫ్‌ సైన్సెస్‌ డొమైన్‌లో మరింత నైపుణ్యాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా యూరోప్‌లో సేవలు విస్తరించనున్నట్లు పేర్కొంది. యూరప్, నార్డిక్స్‌ ప్రాంతంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సామర్థ్యాలు, క్లౌడ్‌ ఆధారిత పరిశ్రమ సొల్యూషన్స్‌ విస్తరణకు దోహదపడనున్నట్లు తెలియజేసింది. 

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్‌)లో డీల్‌ పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేస్తోంది. బేస్‌ లైఫ్‌కు 200 మంది అత్యుత్తమ పరిశ్రమ నిపుణులున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఇన్ఫీ షేరు 0.7% పెరిగి రూ.1,448 వద్ద క్లోజైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement