
న్యూఢిల్లీ: జైడస్ లైఫ్ సైన్సెస్ అనుబంధ సంస్థ జైడస్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి రూ.284.58 కోట్ల మేర నోటీసు జారీ అయింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143(1) కింద జారీ అయిన ఈ డిమాండ్ నోటీసు, 2023–24 అసెస్‌మెంట్ సంవత్సరానికి చెందినదని సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. రిటర్నుల్లో స్పష్టమైన తప్పుల కారణంగానే ఇది చోటు చేసుకుందని, తప్పొప్పులను సరిదిద్దిన అనంతరం మొత్తం పన్ను డిమాండ్ తొలగిపోతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ సూచనలు
కాగా, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లోని సమాచారం, రిపోర్టింగ్ ఎంటెటీల (బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్రోకరేజీలు తదితర) నుంచి అందిన సమాచారం మధ్య పోలిక లేని కేసుల్లో.. వారికి సూచనలు పంపినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. టీడీఎస్/టీసీఎస్‌కు, దాఖలు చేసిన ఐటీఆర్‌లోని సమాచారం మధ్య వ్యత్యాసం ఉన్న వారికి కూడా సూచనలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment