![Elon Musk Mail To Twitter Software Engineers About Understand The Twitter Tech Stack - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/19/elonmusk_twitter.jpg.webp?itok=3vr8QVl5)
లక్షల కోట్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ నాటి నుంచి ట్విటర్‌ను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్, కార్యాలయాల మూసివేత తాజాగా ఉద్యోగులకు జారీ చేసిన అల్టిమేట్టం వరకు ఆ సంస్థ భవిష్యత్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేస్తుంది. అయినా మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో అదే చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిగ్గా మారుతున్నారు.
‘వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేస్తున్నాం. సంస్థ కోసం ఎక్కువ పనిగంటలు పనిచేయాలంటూ’ మస్క్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేశారు.అంతే మస్క్ ఆదేశంతో చిర్రెత్తిపోయిన ఉద్యోగులు ‘నువ్వు వద్దు నీ ఉద్యోగం వద్దు’ అంటూ సుమారు 1200 మంది ఉద్యోగులు ట్విటర్‌కు రిజైన్ చేశారు.
ఆ రిజైన్ చేసిన మరోసటి రోజే మస్క్ ప్రస్తుతం ట్విటర్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఓ మెయిల్ పెట్టారు. అందులో.. ‘మీలో కోడింగ్ రాసే నైపుణ్యం ఉంటే వెంటనే ఈరోజు మధ్యాహ్నం 2గంటల లోపు శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ఆఫీస్‌కు స్వయంగా వచ్చి రిపోర్ట్ చేయాలని కోరారు. కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని మినహాయించినట్లు ఆ మెయిల్స్‌లో మస్క్ చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
గత ఆరు నెలల్లో కోడింగ్‌లో ఫలితాలు రాబట్టిన ఇంజనీర్‌లు బుల్లెట్ పాయింట్ సారాంశాన్ని, అలాగే అత్యంత ముఖ్యమైన 10 కోడ్ లైన్‌ల స్క్రీన్‌షాట్‌లను పంపమని కోరారు. ఎందుకంటే ట్విటర్‌ను బిల్డ్ చేసేందుకు సహాయపడిన టెక్ స్టాక్ (టెక్నాలజీ) ను అర్థం చేసుకోవడంలో తనకు సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈ మెయిల్ పెట్టినట్లు మస్క్ చెప్పారు.
చదవండి👉 వాళ్లు పోతే పోనివ్వండి.. ఆయన పునరాగమనం కావాలా? వద్దా?: ఆసక్తికర పోల్
Comments
Please login to add a commentAdd a comment