ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
►టీసీఎస్‌లోని మార్పులతో సంస్థ మాజీ గ్లోబుల్ హెడ్ ఫర్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) కే.కృతివాసన్ సీఈవో, ఎండీగా నియమించింది.
►బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ప్రస్తుతం టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్,రాజశ్రీని సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ (ఎస్‌ఎంపీ) బాధ్యతల నుంచి తొలగించింది. జులై 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది.
►ఇక, టీసీఎస్‌లో 21 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న గ్లోబుల్ మార్కెట్ న్యూ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభినవ్ కుమార్ ఇకపై పూర్తి స్థాయిలో యూరప్ మార్కెట్‌పై దృష్టి సారించనున్నారు.
►జులై 31న టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కే.అనంత్ కృష్ణన్ రీటైర్ కానున్నారు.
►ఆగస్ట్ 1 నుంచి టీసీఎస్‌లో 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు విధులు నిర్వహిస్తున్న హారిక్ విన్, శంకర్ నారాయణ్, వి. రాజన్న, శివ గణేశన్, అశోక్ పై, రెగురామన్, అయ్యాస్వామీ’లు సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ (ఎస్‌ఎంపీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు.
చదవండి👉 టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!
Comments
Please login to add a commentAdd a comment