
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో సీఈవోగా (ఆసియా పసిఫిక్, భారత్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల విభాగం – ఏపీఎంఈఏ) అనిస్ చెన్చా నియమితులయ్యారు. కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల్లో ఆయనకు రెండు దశాబ్దాల పైగా అనుభవం ఉందని సంస్థ వెల్లడించింది.
అనిస్ ఇప్పటివరకూ క్యాప్‌జెమినిలో గ్లోబల్ సీఈవోగా (బిజినెస్ సర్వీసెస్ విభాగం), గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా వ్యవహరించారు. అత్యంత సమర్ధమంతులైన వారితో టీమ్‌లను తీర్చిదిద్దడం, సంక్లిష్టమైన మార్పులను సమర్ధంగా అమలు చేయగలగడం వంటి సామర్థ్యాలు అనిస్‌కు సొంతమని ఈ సందర్భంగా విప్రో సీఈవో, ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు.
ఇప్పటివరకూ ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ సీఈవోగా వ్యవహరించిన ఎన్‌ఎస్ బాలా వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో అనిస్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment