హైదరాబాద్కు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. యూకే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగూల్ డేటా సెంటర్ అండ్ ఈఆర్పీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కపిల్ టవర్స్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది.
ఈ సందర్భంగా కాగూల్ డేటా ఇండియా ఆపరేషన్స్ హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి మాట్లాడుతూ..కాగూల్ సంస్థ 2017లో నగరంలో తన తొలి బ్రాంచ్ ఆఫీస్‌లో కార్యకలాపాల ప్రారంభించిందని, ఇప్పుడు 2వ డేటా సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా ఈ సంస్థ సేవల్ని మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 200మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా వారిలో 70శాతం స్థానికులేనని వెల్లడించారు. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,000కి పెంచడంతో పాటు ఇక్కడ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 38 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, నగరంలో కాగూల్ లాంటి పెద్ద సంస్థలతో పాటు మధ్యస్థ, చిన్న కంపెనీలు సైతం హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment