Jayesh Ranjan
-
‘AI’ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి.. జయేశ్ రంజన్ పిలుపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం వై2కే సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారానికి దేశీ ఐటీ సంస్థలు, నిపుణులు తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ వై2కే తరహాలో..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విభాగాల్లో వస్తున్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ డిజిటల్ పరివర్తనపైన నిర్వహించిన ఐటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జయేశ్ రంజన్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, 2022–23లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 31 శాతం వృద్ధి చెందాయని, ఉద్యోగాల కల్పన 16.2 శాతం పెరిగిందని, ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు. 3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్‌ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
నచ్చిన రంగాల్లో యువత రాణించాలి
వెంగళరావునగర్ (హైదరాబాద్): స్వయంశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. యువత నేటి కాలానికి అనుగుణంగా అన్నిరకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకుని యువతీ యువకులు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని, తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్‌మే) శిక్షణ సంస్థలో స్వయంశక్తితో ఎదగాలనుకునే యువతకు శిక్షణలో భాగంగా గురువారం జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్టైతే.. ప్రభుత్వం బ్యాంకుల తరఫున రుణాలను మంజూరు చేస్తుందని, తద్వారా చిన్న, మధ్యతరహా, భారీ వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకర్లు కూడా యువతలోని నైపుణ్యాన్ని గ్రహించి వారిని నిరుత్సాహ పరచకుండా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక చేయూతను అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ వివేక్, నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాగా నిమ్స్‌మేలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను సతీష్‌రెడ్డి ప్రారంభించారు. -
ముగ్గురు ఫ్రెండ్స్‌తో ఎన్నో కొంటె పనులు చేశా: నాగార్జున
సాక్షి, హైదరాబాద్: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ లోకి రాగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి' అన్నారు కింగ్ నాగార్జున. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో బుధవారంన ఆడు నాగార్జునతో పాటు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. 1976లో నేను ఇందులో చదువుకున్నా. ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. ఆ రోజుల్లో నాతో పాటు చదివిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్నో కొంటె పనులు చేశాం. నాతో పాటు చదివిన వారందరు లాయర్లుగా, జడ్జిలుగా , బిజినెస్‌మెన్స్‌గా గొప్ప స్థాయిలో ఉన్నారు. స్కూల్లో నాగార్జున పేరుతో ఒక బిల్డింగ్ ఉండడంతో అందరు నా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేవారు. నా పేరు చెప్పినప్పుడల్లా నాగార్జున నీ పేరా? బిల్డింగ్ పేరా? అని అడిగే వారు. మా ఇల్లు పక్కనే ఉండేది. కొన్ని సార్లు నడుచుకుంటూ, మరికొన్ని సార్లు సైకిల్ మీద వచ్చేవాన్ని. స్కూల్లోకి ఎంటర్ అవగానే ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. కాగా 1923లో బేగంపేట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. 2023తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది మొత్తం వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తోంది. నగర్ కమీషనర్ సీవీ ఆనంద్, హీరో నాగార్జున, అడోబ్ సీఈఓ శాంతను నరేన్ పలువురు ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. -
నూతన సాంకేతికతతో ఉద్యోగాలేమీ పోవు
సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికత వినియోగంతో ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన అవసరం లేదని నూతన ఉద్యోగాల సృష్టి సాధ్యపడుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. సోమవారం తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో చాట్‌జీపీటీ, జీపీటీ టూల్స్ అన్న అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. జూమ్‌లో వర్చ్యు వల్ ఆడియన్స్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో విజ్ఞానాన్ని మెరుగుపరచడంలో సరికొత్తదని తెలిపారు. సరదా ప్రయోజనాల కోసం, సరదాగా ప్రశ్నించడం కోసం ఇది ఉపయోగ పడుతుందన్నారు. ఇటీవల తాను అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు తెలుగు సామెతలు అడగ్గా... ఇది తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో మాత్రమే కాకుండా వాటి అర్థాలను కూడా ఇచ్చిందని తెలిపారు. విస్తారమైన డేటా నుంచి చాలా వేగంగా శోధించగల సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ‘జయే‹శ్ రంజన్ ఎవరు? అని అడిగితే హెల్త్ సెక్రటరీ అని సమాధానం ఇచ్చింది, కానీ తాను ఎప్పుడూ ఆరోగ్య కార్యదర్శిగా పనిచేయలేదన్నారు.. చాట్ జీపీటీ మరియు జీపీటీ సాధనాలు మానవ జాతికి ఎలా సహాయపడతాయో జయేష్ రంజన్ తెలిపారు. ఈ వెబినార్‌లో చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్, గ్లోబల్ హెడ్ టెక్నాలజీ అడ్వైజరీ సర్వీసెస్ బాల ప్రసాద్, ఎఫ్‌టీసీసీఐ ఐసీటీ కమిటీ చైర్మన్ కె. మోహన్ రాయుడు తదితరులు మాట్లాడారు. -
పీపుల్స్ ప్లాజా వేదికగా ‘రాల్–ఇ’
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ ర్యాలీ ‘రాల్–ఇ’ నగరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. వారం పాటు జరిగే ఈ ర్యాలీ ఆదివారం 400 వందలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహ నాల వైపు మొగ్గుచూపాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలుదారులకు రాయితీలను ఇస్తుందన్నారు. ఈవీల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మొదటిసారిగా ఇ–మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా పీపుల్స్ ప్లాజా, మియాపూర్, శంషాబాద్, ముంబై హైవే నుంచి అందరూ ఎలక్ట్రిక్ వాహనాలతో రాల్–ఇ ర్యాలీతో హైటెక్స్ వరకు చేరుకుంటారన్నారు. సౌకర్యవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొను గోలు చేయాలని సూచించారు. నగరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కూడా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అడివి శేషు మాట్లాడుతూ.. యువత ఈవీల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రావ్టన్ మోటార్స్‌కు చెందిన షెరాజ్, రాహుల్‌లు ఎలక్ట్రిక్ వాహనాలతో చేసిన స్టంట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ర్యాలీలో దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్‌ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
హైదరాబాద్‌కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్‌తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్‌ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
ఆఫీస్ సంస్కృతి మళ్లీ పెరగాలి
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఆఫీస్ వర్క్‌స్పేస్ విభాగంలో అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించే ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం హైటెక్ సిటీలోని మై హోమ్ వేదికగా ప్రీమియం సెంటర్ ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... ఇలాంటి వినూత్న వేదికల వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. విభిన్న రీతిలో పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఉద్యోగులకు మళ్లీ ఆఫీస్‌లో పనిచేయాలనే ఆతృతను పెంచుతుందన్నారు. మహాభారత సంప్రదాయ ఇతివృత్తంతో రూపొందించిన సాఫ్ట్వేర్ స్పేస్ ఆకట్టుకుందని, ఇలాంటి వేదికలు మరింత విస్తరించాలని జూపల్లి రామేశ్వర్ రావు పేర్కొన్నారు. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ సీఈవో పాటిబండ్ల సుందరి మాట్లాడుతూ... వ్యాపార రంగంలో వినూత్న ఆలోచనలున్న వారిని మంచి ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చడానికి అవసరమైన అంతర్గత నిపుణుల బృందం తమవద్ద ఉందన్నారు. నగరంలోనే కాకుండా విజయవాడ, చెన్నై, పూణే, బెంగళూరు, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబైలలో కూడా తమ వర్కింగ్ స్పేస్‌లను ప్రారంభించనున్నామన్నా రు. కార్యక్రమంలో సహ వ్యవస్థాపకులు శ్రీని, ప్రాజె క్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శేషు, మణివణ్ణన్ పాల్గొన్నారు. -
అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్ యాప్’
సాక్షి, హైదరాబాద్: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ సహ భాగస్వామి. సాయిప్రణీత్‌తో పాటు అనిల్ కుమార్ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇతర స్పోర్ట్స్ యాప్‌లతో పోలిస్తే ‘వాట్స్ ఇన్ ద గేమ్’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 24 వేల కోట్లు ‘డిస్ప్లే’
సాక్షి, హైదరాబాద్: దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది. ఆదివారం బెంగళూరులో మంత్రి కె. తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాçహనా ఒప్పందం కుదిరింది. ఎలెస్ట్ తరఫున రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్ డిస్ప్లేలను ‘ఎలెస్ట్’తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ (ఎల్రక్టానిక్స్) సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే అవకాశం: రాజేశ్ మెహతా తెలంగాణలో తాము ఏర్పాటు చేయబోయే డిస్ప్లే ఫ్యాబ్ వల్ల అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే అవకాశం ఉందని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతా తెలిపారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3,000 మంది శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతోపాటు డిస్ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, అనుబంధ సంస్థలు, సరఫరాదారుల రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 6వ తరం అమోలెడ్ డిస్ప్లే తయారీ ద్వారా భారత్ నుంచి ఫ్యూచర్ టెక్నాలజీని తమ ఎలెస్ట్ కంపెనీ ప్రపంచానికి అందిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు: మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల పెట్టుబడి వచి్చన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పరిణామాన్ని తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజుగా అభివరి్ణంచారు. దేశ హైటెక్ తయారీ రంగానికి వచి్చన భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రానున్న రూ. 24 వేల కోట్ల పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత్‌ను ప్రపంచ హైటెక్ పరికరాలను తయారు చేస్తున్న దేశాల సరసన నిలుపుతుందన్నారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్లకు మాత్రమే సాధ్యమైనది ఇకపై తెలంగాణలో అవుతుందన్నారు. దేశ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎకోసిస్టం, అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ , డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవనుందన్నారు. -
ఒక్కరోజే రూ.3,250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించడం లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఆదివారం ముగిసింది. చివరిరోజు అమెరికా లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో కేటీఆర్ విజయం సాధించారు. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.1,750 కోట్లు, స్లేబ్యాక్ ఫార్మా రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. అలాగే జీనోమ్ వ్యాలీలో ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలో రెట్టింపు చేస్తామని క్యూరియా గ్లోబల్ వెల్లడించాయి. హైదరాబాద్‌లోని కంపెనీల్లో అడ్వెంట్ పెట్టుబడులు న్యూయార్క్‌లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మాల్డోనాడోతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఇద్దరూ చర్చించారు. హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ , అవ్రా లేబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ. 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. నగరంలో స్లేబ్యాక్ సీజీఎంపీ ల్యాబ్ న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ.. హైదరాబాద్ ఫార్మా రంగంలో రాబోయే మూడేళ్లలో సుమా రు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. సీజీఎంపీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని కేటీఆర్‌తో భేటీ తర్వాత సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌సింగ్ ప్రకటించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. హైడ్రాక్సీ ప్రోజెస్టెరాన్ 5 ఎంఎల్ జెనరిక్ ఔషధానికి అనుమతులను పొందడంతో పాటు అమెరికన్ మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీయేనని కేటీఆర్‌కు సంస్థ సీఈవో వివరించారు. జీనోమ్ వ్యాలీలో యూఎస్పీ ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషద తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా (యూఎస్పీ) ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణ సామర్థ్యం ఉంటుందని చెప్పింది. ఈ ల్యాబ్‌లో 50 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని తెలిపింది. నిరంతర ఔషధ తయారీ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరయ్యే కొత్త ప్రక్రియ, సాంకేతికతను ఈ బృందం అభివృద్ధి చేస్తుందని ప్రతినిధులు చెప్పారు. ఏడాదిలో క్యూరియా సర్వీస్ సెంటర్ ఉద్యోగులు రెట్టింపు న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న క్యూరియా గ్లోబల్.. హైదరాబాద్‌లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను మరో 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. కేటీఆర్‌తో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకావ్ పాండియన్ సమావేశం తర్వాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. వివిధ రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్ సర్వీస్ అందించడానికి గతేడాది హైదరాబాద్‌లో గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు పాండియన్ తెలిపారు. సర్వీస్ సెంటర్లో ప్రస్తుతం 115 మంది పనిచేస్తున్నారని, 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కంపెనీ దేశంలో ఇప్పటికే 27 మిలియన్ డాలర్ల (రూ. 200 కోట్ల)పెట్టుబడి పెట్టింది. -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా డిజిటల్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్లో మొదటి ఫేజ్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతున్నట్లు డేటా సెంటర్ ప్రకటనకు సంబంధించి కంపెనీ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ‘‘భారత్‌లో అత్యంత భారీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానం కావడం సంతోషంగా ఉంది. వచ్చే 15 ఏళ్లలో దీనిపై రూ. 15,000 కోట్ల మేర సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలోకి వచ్చిన అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇది రెండోది అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ పరోక్షంగా స్థానిక వ్యాపారాల అభివృద్ధికి .. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీల మేనేజ్మెంట్, డేటా .. నెట్వర్క్ భద్రత, నెట్వర్క్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలదని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ తదితరులు పాల్గొన్నారు. భారత్‌లో నాలుగోది ... మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) తదితర సొల్యూషన్స్ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు.. భారత ఎకానమీకి 9.5 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని సమకూర్చాయని అనంత్ మహేశ్వరి వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా నగరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి హైదరాబాద్ వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నరాలు, గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ సంస్థ సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య ఉపకరణాల పార్కులో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయన్నారు. 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 50కి పైగా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి తయారీ, పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేశాయన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ రంగంలో వైద్య ఉపకరణాల పార్కును బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.250 కోట్లతో తాము నెలకొల్పే యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రమోటర్, డైరెక్టర్ బదరీ నారాయణ్ వెల్లడించారు. కేటీఆర్‌తో బదరీ నారాయణ్, విజయగోపాల్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
క్యూ కడుతున్న టెక్ కంపెనీలు, హైదరాబాద్ కేంద్రంగా యూకే టెక్ కంపెనీ ప్రారంభం!!
హైదరాబాద్‌కు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. యూకే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగూల్ డేటా సెంటర్ అండ్ ఈఆర్పీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కపిల్ టవర్స్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాగూల్ డేటా ఇండియా ఆపరేషన్స్ హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి మాట్లాడుతూ..కాగూల్ సంస్థ 2017లో నగరంలో తన తొలి బ్రాంచ్ ఆఫీస్‌లో కార్యకలాపాల ప్రారంభించిందని, ఇప్పుడు 2వ డేటా సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా ఈ సంస్థ సేవల్ని మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 200మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా వారిలో 70శాతం స్థానికులేనని వెల్లడించారు. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,000కి పెంచడంతో పాటు ఇక్కడ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 38 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, నగరంలో కాగూల్ లాంటి పెద్ద సంస్థలతో పాటు మధ్యస్థ, చిన్న కంపెనీలు సైతం హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయని కొనియాడారు. -
దేశానికి పాఠాలు నేర్పే దిశగా..
సాక్షి, హైదరాబాద్: మానవ వనరులు, థింక్ ఫోర్స్‌ను సరిగ్గా ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కల్పించినప్పుడే భారతదేశ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని, అప్పుడే దేశం గణనీయ పురోగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ‘2030 నాటికి భారతదేశ అభివృద్ధి’అనే అంశంపై ఆదివా రం జరిగిన హార్వర్డ్ ఇండియా సదస్సులో కేటీఆర్ వర్చువల్ విధానంలో మాట్లాడారు. భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరముందని, ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్, వీహబ్, అగ్రిహబ్ వంటి ఇంక్యుబేటర్లను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ‘ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తుంది’అనే నాను డి ఉండేది. కానీ, ఈ రోజు తెలంగాణ ఆలోచించి, చేసింది.. రేపు భారతదేశం చేస్తుంది’అనే విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. ‘భారతదేశం మరింత వేగంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో కాటన్ ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా భారత్ ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ ,శ్రీలంకల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తోంది.. ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరలకన్నా భారతదేశంలో తయారుచేసే మెడికల్ పరికరాల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి.. వియత్నాం, తైవాన్ లాంటి చిన్నదేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి, ఇందులో మనదేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులు ఏమిటి.. దేశంలోని నదులు నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి.. ఇలాంటి ప్రశ్నల గురించి దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి’అని అన్నారు. ఏడేళ్లలో తెలంగాణ మున్ముందుకు... దేశంలోనే అతితక్కువ వయసు గల తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పేదిశగా ముందుకు వెళుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కేటీఆర్ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. -
బ్రిటిష్ కౌన్సిల్‌తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ, యూకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్ (రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా కృషి చేస్తాయి. అంతరిక్షం, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఆంగ్లం, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో రిచ్‌తో పాటు బ్రిటిష్ కౌన్సిల్ నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉత్తమ విధానాల్లో శిక్షణ కోసం అవసరమయ్యే ఆవిష్కరణలపై యూకే, రిచ్ కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, దక్షిణ భారత విభాగం బ్రిటిష్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్ రయ్ రయ్..
సాక్షి, హైదరాబాద్: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్ వద్దకు వెళ్లి యాప్‌ను ఆన్‌చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్ అయిపోతుంది. యాప్ ద్వారానే స్కూటర్ నడిపిన తర్వాత పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్ ఫోన్లోని హల మొబిలిట్ యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్‌లోని ‘ల్యాబ్ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. -
‘ఫ్లో కెమిస్ట్రీ’తో వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రం స్థాపన వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ముడి రసాయనాల (ఆక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్)ను నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్), డాక్టర్ సత్యనారాయణ చావా (లారస్ ల్యాబ్స్), శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్ డైరెక్టర్)తోపాటు డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి (డాక్టర్ రెడ్డీస్ లైఫ్‌సైన్సెస్ ఇనిస్టిట్యూట్) సంతకాలు చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ నుంచి నిధులు, ఇతర సహకారం లభిస్తుంది. సీఓఈలో జరిగే పరిశోధనలకు పేరొందిన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేస్తారు. ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతర ఉత్పత్తి ద్వారా లబ్ధిపొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్ధిపొందేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు: కేటీఆర్ పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించడంతోపాటు కాలుష్యరహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’పేరిట ఏర్పాటయ్యే హబ్ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఓఈ ఏర్పాటులో డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లైఫ్ సైన్సెస్ విభాగం డైరక్టర్ శక్తి నాగప్పన్ అన్నారు. సీఓఈలో తమకు భాగస్వామ్యం కల్పించడం పట్ల రెడ్డీస్ ల్యాబ్స్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా హర్షం వ్యక్తం చేశారు. -
రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
వారు మాకు బ్రాండ్ అంబాసిడర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారిని చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయని, తెలంగాణ మాత్రం వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘8వ జాతీయ సదస్సు 2021’లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం అనగా సుమారు 32 బిలియన్ డాలర్ల మేర ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఆకర్షించామని చెప్పారు. పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులపై మార్గదర్శనం చేసేందుకు నైపుణ్యం కలిగిన యువకుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’వేదిక ద్వారా ఈ యువకులు మంచి ఫలితాలు రాబడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చుతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తున్నామని, స్థానికులకు ఎక్కువసంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నామని వివ రించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తు న్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీవ ఔషధాలతోపాటు ఫార్మా, బయోటెక్, వైద్య ఉపకరణాలు, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర, యంత్ర, ఎలక్ట్రానిక్ వాహనాలు, ప్లాస్టిక్, రసాయన, వజ్రాభరణాలు, చిల్లర వర్తకం వంటి రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సమావేశంలో ఫిక్కి కార్యదర్శి జనరల్ దిలీప్ షెనాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.