సాక్షి, హైదరాబాద్: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ లోకి రాగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి' అన్నారు కింగ్ నాగార్జున. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో బుధవారంన ఆడు నాగార్జునతో పాటు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. 1976లో నేను ఇందులో చదువుకున్నా. ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. ఆ రోజుల్లో నాతో పాటు చదివిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్నో కొంటె పనులు చేశాం. నాతో పాటు చదివిన వారందరు లాయర్లుగా, జడ్జిలుగా , బిజినెస్‌మెన్స్‌గా గొప్ప స్థాయిలో ఉన్నారు.
స్కూల్‌లో నాగార్జున పేరుతో ఒక బిల్డింగ్ ఉండడంతో అందరు నా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేవారు. నా పేరు చెప్పినప్పుడల్లా నాగార్జున నీ పేరా? బిల్డింగ్ పేరా? అని అడిగే వారు. మా ఇల్లు పక్కనే ఉండేది. కొన్ని సార్లు నడుచుకుంటూ, మరికొన్ని సార్లు సైకిల్ మీద వచ్చేవాన్ని. స్కూల్‌లోకి ఎంటర్ అవగానే ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. కాగా 1923లో బేగంపేట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. 2023తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది మొత్తం వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తోంది. నగర్ కమీషనర్ సీవీ ఆనంద్, హీరో నాగార్జున, అడోబ్ సీఈఓ శాంతను నరేన్ పలువురు ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు.
Comments
Please login to add a commentAdd a comment