
పీపుల్స్‌ప్లాజా వద్ద ర్యాలీలో ఎలక్ట్రిక్ వాహనాలు
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ ర్యాలీ ‘రాల్–ఇ’ నగరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. వారం పాటు జరిగే ఈ ర్యాలీ ఆదివారం 400 వందలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహ నాల వైపు మొగ్గుచూపాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలుదారులకు రాయితీలను ఇస్తుందన్నారు.
ఈవీల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మొదటిసారిగా ఇ–మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా పీపుల్స్ ప్లాజా, మియాపూర్, శంషాబాద్, ముంబై హైవే నుంచి అందరూ ఎలక్ట్రిక్ వాహనాలతో రాల్–ఇ ర్యాలీతో హైటెక్స్ వరకు చేరుకుంటారన్నారు. సౌకర్యవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొను గోలు చేయాలని సూచించారు.
నగరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కూడా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అడివి శేషు మాట్లాడుతూ.. యువత ఈవీల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రావ్‌టన్ మోటార్స్‌కు చెందిన షెరాజ్, రాహుల్‌లు ఎలక్ట్రిక్ వాహనాలతో చేసిన స్టంట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ర్యాలీలో దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment