131 ఈవీలపై పన్ను మినహాయింపు | 131 Tax exemption on EVs | Sakshi
Sakshi News home page

Hyderabad: 131 ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు

Published Tue, Nov 19 2024 3:27 AM | Last Updated on Tue, Nov 19 2024 4:09 PM

131 Tax exemption on EVs

రూ. 25.15 లక్షలు మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించిన నేపథ్యంలో మొదటిరోజు సోమవారం హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలపైన పన్నులు, ఫీజుల రూపంలో రవాణాశాఖ రూ.25.15 లక్షల మినహా­యింపునిచ్చింది. మొదటి రోజు హైదరా­బాద్‌లో 121 ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లు కొత్తగా అమ్ముడయ్యాయి. కార్లపై­న జీవితకాల పన్ను రూపంలో రూ.13.74 లక్షలు, రిజిస్ట్రేషన్‌ ఫీజుల రూపంలో మరో రూ.6,000 వరకు వాహన­దా­రులకు రాయితీ లభించింది. 

అలాగే 121 ద్విచక్ర వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో రూ.10.94 లక్షల వరకు వాహనదారులకు రాయితీ లభించడం గమనార్హం. ఆటోలు, గూడ్స్‌ వాహనాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి విధించే త్రైమాసిక పన్ను నుంచి కూడా మినహా­యింపు లభించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకా­శాన్ని వాహన కొనుగోలు­దార్లు సద్వినియో­గం చేసుకోవాలని హైద­రా­బాద్‌ జేటీసీ రమేశ్‌ సూచించారు. 

నగరంలో వాహన కాలు­ష్యం ఆందోళన కలిగి­స్తున్న దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియో­గం వైపు మళ్లా­ల­ని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement