
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీల ఆదాయాలు(డాలర్ల పరంగా) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతంతమాత్రంగానే ఉంటాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేస్తోంది. గతంలో తాము ఇచ్చిన నెగిటివ్ (మైనస్ మూడు శాతం) వృద్ధి అంచనాలను సవరిస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ సర్వీసులకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని వివరించింది. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌తో ఐటీ కంపెనీలు తమ సర్వీసుల్లో అంతరాయాల సమస్యను అధిగమిస్తున్నాయని పేర్కొంది. అందుకనే ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను నెగిటివ్ నుంచి ఫ్లాట్ గా సవరించామ ని వివరించింది. ఇక్రా ఇంకా ఏం చెప్పిందంటే... కరోనా సంబంధిత ఆందోళనలు కొనసాగు తుండటంతో వ్యాపార సంస్థలు వర్చువల్ మోడల్స్‌కు మారుతున్నాయి.
దీంతో ఐటీ కం పెనీల సేవలకు డిమాండ్ పుంజుకుంటోంది. డిజిటల్ టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉండటం ఐటీ కంపెనీలకు కలసి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించడంతో సరఫరా, డిమాండ్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. ఐటీ కంపెనీలపై కూడా ఐటీ సర్వీసులందించడంపై కరోనా కల్లోలం ప్రభావం చూపించింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా తన సేవల్లో అంతరాయాల సమస్యను ఐటీ కంపెనీలు అధిగమించగలిగాయి. అయితే డిమాండ్ సంబంధిత సమస్యలు ఒకింత కొనసాగుతున్నాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయాల్లో దాదాపు 80 శాతం మేర యూరప్, అమెరికా దేశాల నుంచే వస్తోంది. ఈ ఏడాది కరోనా కల్లోలం తీవ్రంగా ఉండటంతో ఆయా దేశాల్లో జీడీపీ బాగా తగ్గింది. దీంతో ఆయా దేశాల్లోని కంపెనీలు తమ వ్యయాలపై నియంత్రణ విధిస్తున్నాయి. దీంట్లో భాగంగా మన ఐటీ కంపెనీలను డిస్కౌంట్లు అడుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment