ఐటీ ఉద్యోగులు బ్యాడ్ న్యూస్. ఐటీ ఉద్యోగులంటే వారి జీత భత్యాలు, ఆ తర్వాతే వారి కార్యకలాపాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడా ఆ విషయంలో ఐటీ సంస్థలు ఆచుతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు ఉద్యోగులకు భారీ ఎత్తున పెంచే ఇంక్రిమెంట్స్ వచ్చే ఏడాది తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారికి కారణంగా అన్నీ రంగాలు కుప్పకూలితే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించాయి. రానున్న రోజుల్లో ఆ రంగం వృద్ధి బాగుంటుందని సంబరపడే లోపే ఆర్ధిక మాంద్యం, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, ది గ్రేట్ రిజిగ్నేషన్, రిటెన్షన్ వంశాలు ఆయా దిగ్గజ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి.
ఈ తరుణంలో వచ్చే ఏడాది ఐటీ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు 12శాతం నుంచి 9శాతానికి తగ‍్గి ప్రీ కోవిడ్ లెవల్స్ చేరుకుంటాయంటూ ప్రముఖ స్టాఫింగ్ సర్వీసెస్ అండ్ హెచ్‌ఆర్ రిక్రూట్మెంట్ సీఈవో సునీల్ చెమ్మన్ కోటిల్ తెలిపారు.
గత కొన్ని నెలలుగా టెక్ సంస్థలు ఐటీ ఉద్యోగులకు 70శాతం నుంచి 80శాతం ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. ఐటీ సర్వీస్‌లు అందించేందుకు స్టార్టప్స్ నుంచి దిగ్గజ కంపెనీలకు వరకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వీటితో పాటు రిటెన్షన్ సమయంలో ఉద్యోగులకు చెల్లించే వేతనాల్ని తగ్గించి..వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నాయి. ముఖ్యంగా యూఎస్, అమెరికా, యూరప్ దేశాల టెక్ సంస్థలు ప్రయత్నాల్లో ఉన్నాయి. వాటి ప్రభావం దేశీయ కంపెనీలు, ఉద్యోగులపై పండనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు
చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం,వరస్ట్ ఇయర్‌గా 2022
Comments
Please login to add a commentAdd a comment