దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో కూడా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్....
పాట్నా: దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో కూడా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో) సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చినట్లు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోని గోరఖ్‌పూర్, ఘాజీపూర్ వంటి ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు.
ఇలాంటి బీపీవోలకు పన్నులపరమైన మినహాయింపులు, నిబంధనల సరళతరం తది తర చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శనివారం స్థానిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో ఇన్‌క్యుబేషన్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.