![Towards On-Site Net Zero Award for Control-S - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/29/control-s.jpg.webp?itok=5lNeMM2e)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్-ఎస్ డేటాసెంటర్స్ తాజాగా ‘టువర్డ్స్ ఆన్-సైట్ నెట్ జీరో’ అవార్డ్ దక్కించుకుంది. మొనాకోలో జరిగిన డేటాక్లౌడ్ గ్లోబల్ కాంగ్రెస్ 2023 సందర్భంగా కంపెనీ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి అవార్డును స్వీకరించారు. నెట్ కార్బన్ జీరో కార్యక్రమాలు, ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్‌జీ) లక్ష్యాల పట్ల కంపెనీ నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని కంట్రోల్–ఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment