ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్ | CM KCR world economic forum in september | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్

Published Sun, Aug 23 2015 12:34 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్ - Sakshi

ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో సీఎం, ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లనుంది. సీఎం ముఖ్య కార్యదర్వి ఎస్.నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ బృందంలో వుండనున్నారు. ఈ మేరకు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement