china trip
-
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై ప్రత్యేక కమిటీ
డిసెంబర్ 3 నుంచి చైనాలో పర్యటించనున్న బృంద సభ్యులు సాక్షి, హైదరాబాద్: 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికిగాను ప్రత్యేకంగా అధ్యయన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్‌లతో పాటు ఆర్అండ్బీ సీఈ గణపతిరెడ్డి, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి గుట్ట ఆర్డ్ డెరైక్టర్లు ఆనందసాయి, లక్ష్మి నారాయణలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. అతిపెద్ద బుద్ధుని విగ్రహంతోపాటు పలు విగ్రహాలను చైనాలో విజయవంతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయా విగ్రహాల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కమిటీ సభ్యులు అవగాహన పెంచుకోనున్నారు. ఖర్చును సైతం అంచనా వేయడంతో పాటు నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు.. సర్దుబాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. డిసెంబర్ 3 నుంచి 11 వరకు పర్యటన సాగనుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యాదగిరిగుట్ట ఆర్ట్ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా చేర్చింది. పర్యటన అనంతరం వారిచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
చైనా సంస్థల అధినేతలతో నేడు కేసీఆర్ బృందం భేటీ
బీజింగ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన ఆరో రోజు కొనసాగుతోంది. నేడు రాజధాని బీజింగ్ నగరంలో పలు కంపెనీల అధినేతలతో కేసీఆర్ బృందం భేటీ అవుతుంది. చైనా రైల్వే కార్పొరేషన్, ఇన్సుపర్ గ్రూప్, చైనా ఫార్చూన్ ల్యాండ్, గ్రీన్ సిటీ లిమిటెడ్, శాని గ్రూపులతో సీఎం బృందం భేటీ అయి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడుల విషయంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న పరిస్థితులను చైనా సంస్థల అధినేతలకు సీఎం వివరించి, రాష్ట్రానికి వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. -
'చైనాకు వెళ్లి ఆయన సాధించేం లేదు'
హైదరాబాద్ : చైనాకు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాధించేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏదేశంలో కూడా చైనా కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన చెప్పారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని, రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నప్పటికీ కేంద్రం సాయం కోసం ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ప్రభుత్వం చట్టం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌లో అసంతృప్తి నెలకొందని, రాష్ట్రానికి పూర్తిస్తాయి ఇంఛార్జ్ కావాలన్నారు. పీసీసీ, సీఎల్పీ కూడా కేడర్‌తో మమేకమై ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా పోరాడాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పిలుపిచ్చారు. -
'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?'
హైదరాబాద్ : హామీలు, ప్రకటనలకు పరిమితం అయ్యేందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 15 నెలలు రైతు సంక్షేమం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచించనేలేదని ఆయన విమర్శించారు. చైనాకు వెళ్లి పరిశ్రమలు తెస్తే మంచిదే, కానీ అందులో పది శాతమైనా రైతుల గురించి ఆలోచిస్తే బాగుండేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కేసీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు. -
ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో సీఎం, ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లనుంది. సీఎం ముఖ్య కార్యదర్వి ఎస్.నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ బృందంలో వుండనున్నారు. ఈ మేరకు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
చైనాలో మోదీ.. రెండోరోజు టూర్
-
ఆ 24 ఒప్పందాలు ఇవే..
బీజింగ్: చైనా పర్యటనలో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇరుదేశాల అధినేతలు పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలపై సంతకాలు ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అనంతరం మోదీ ప్రాంతీయ నేతల వేదికపై మాట్లాడారు. చైనాలో పర్యటన సంతోషంగా ఉందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపామని, సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలను, రాష్ట్రాలతో పాటు ప్రజల మధ్యకు తీసుకు వెళతామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమైనదని, వాణిజ్య, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం అని అన్నారు. చైనాతో ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్- చైనాతో చేసుకున్న ఒప్పందాల వివరాలు: 1. చెన్నై, చైనాలోని చెంగ్డూలో రాయభార కార్యాలయాలు ఏర్పాటు 2. భారత్‌లో వృత్తి విద్యను మెరుగు పరచడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోసం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు పరస్పర సహకారం అందించుకోవడం 3. వ్యాపార సంబంధాలను దౌత్యవిధానం ద్వారా నిర్వహించడం 4. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య సహాయ సహాకారాలు కొనసాగించాలి 5. భారత్, చైనా రైల్వే సంస్థల మధ్య నిర్వహణ విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం 6. రెండు దేశాల మధ్య విద్యకు సంబంధించిన విధానాలను పరస్పరం అవలంభించడం 7. ఖనిజాలు, గనుల రంగాలలో పరస్పరం సహకరించుకోవడం 8. అంతరిక్ష సంబంధ విషయాలలో మైత్రి కొనసాగించడం 9. భారత్ దిగుమతి చేసుకుంటున్న రేప్ సీడ్ ఉత్పత్తులపై సురక్షిత మార్గదర్శకాలు 10. దూరదర్శన్, సీసీటీవీల మధ్య ప్రసార సంబంధమైన అంశంపై ఒప్పందం 11. ఇరు దేశాలు కలిసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం 12. రాజకీయ, మిలటరీ, ఆర్థిక సంబంధమైన అంశాలను అభివృద్ధి చేసుకునేందుకు రెండు దేశాలు కలిసి సంస్థలను నెలకొల్పడం 13. నీతి ఆయోగ్, డెవలప్ మెంట్ రీసెర్చ్ సెంటర్ మధ్య పరస్పర అవగాహన 14. భూకంప విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ రంగాలలో పరస్పర సహకారం 15. వాతావరణ మార్పులు, సముద్ర విజ్ఞాన శాస్త్రం అంశాలపై అంగీకారం 16. భూ విజ్ఞాన శాస్త్రం రంగానికి సంబంధించి ఒప్పందం 17. రాష్ట్రాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల నేతల నిమామకాలపై పరస్పర అవగాహన 18. భారత్, చైనా దేశాలలో ఉన్న రాష్ట్రాలు, మునిసిపాలిటీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుకోవడం 19. చైనాలోని సిచువాన్, భారత్ లోని కర్ణాటక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు 20. తమిళనాడులోని చెన్నై, చైనాలోని చోంగ్జింజ్ నగరాల మధ్య లావాదీవిలకు సంబంధించి అవగాహనా ఒప్పందం 21. హైదరాబాద్, చైనాలోని గింగ్డౌ నగరాల మధ్య స్నేహపూర్వక వర్తక, వ్యాపార అంశంపై పరస్పర ఒప్పందం 22. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, చైనాలోని డున్హువాంగ్ నగరాల మధ్య వ్యాపార ఒప్పందం 23. ఐసీసీఆర్, ఫుడాన్ విశ్వవిద్యాలయాలం మధ్య సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ ఏర్పాటుకు ఒప్పందం 24. భారతీయ యోగా విద్యను చైనాలోని కుమ్నింగ్ కాలేజీలో ప్రవేశపెట్టేందుకు ఇరుదేశాల మధ్య సమ్మతి -
చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. గురువారం చైనా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి ప్రధాని లి కెక్వియాంగ్ లో విస్తృతచర్చలు జరపనున్నారు. భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య శాంతి సంబంధాల కల్పన ఈ పర్యటనలో భాగమని ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రసిద్ధ బౌద్ధ నిర్మాణం పగోడాను నేడు నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. -
ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన
అర్ధరాత్రి హైదరాబాద్‌కు సీఎం బృందం ఆరు రోజుల పాటు చైనాలో పర్యటన చైనా ప్రభుత్వం, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పలు ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆరు రోజుల చైనా పర్యటనను ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకుంది. చైనాలోని బీజింగ్, చెంగ్డు, షాంఘై నగరాల్లో పర్యటించిన బృందం మధ్యాహ్నం మూడున్నర గంటలకు షాంఘై నుంచి బయలుదేరి మలేసియా రాజధాని కౌలాలంపూర్ మీదుగా అర్ధరాత్రి 12.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా ఏపీ, చైనాల మధ్య పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులతో పాటు వివిధ రంగాల్లో సహకారానికి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం వెంట వెళ్లిన పారిశ్రామికవేత్తలు కూడా పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. పర్యటన చివరి రోజు శుక్రవారం చంద్రబాబు బృందం చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శితో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. సీసీపీకార్యదర్శి హాంగ్జంగ్తో భేటీ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) కార్యదర్శి హాంగ్జంగ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ 33 సంవత్సరాల ప్రస్తానాన్ని జంగ్కు వివరించారు. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో పాటు టీడీపీకి ఇదే విధమైన సహయం అందించాలని కోరారు. ఏపీలో మీరేంటో ప్రపంచానికి చాటండి ఏపీకి వచ్చి కొత్త రాజధాని అమరావతిని నిర్మించి ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం చైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల కిందట తాను చూసిన షాంఘై నగరానికి ప్రస్తుతం చూస్తున్న నగరానికి పోలికే లేదన్నారు. షాంఘైలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. హైటెక్ పార్కులు అభివృద్ధి చేస్తాం: యుయాంగ్ ఏపీలో హైటెక్ పార్కుల అభివృద్ధికి చైనా కంపెనీలను ప్రోత్సహిస్తామని షాంఘై కామర్స్ కమిషన్ డెరైక్టర్ జనరల్ షాంగ్ యుయాంగ్ తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణంలో చైనా నిపుణుల సహకారం ఉంటుందన్నారు. తమ నిపుణులు ఏపీ నగరాల నిర్మాణానికి అవసరమైన డిజైనింగ్ చేయడంలో సహ కరిస్తారన్నారు. రౌండ్ టేబుల్‌కి హాజరైన వారి సందేహాలకు ఐఏఎస్ అధికారులు అజయ్‌జైన్, రావత్‌లు సమాధానమిచ్చారు. నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీల్లో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి నగరంలో ఐకానిక్ బిల్డింగులు నిర్మించాల్సి ఉందని, ఇందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల కోసం తాము ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏపీలో వెంటనే పర్యటించి వారికి నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని నూతన అభివృద్ధి ఆలోచనలతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జేఏ సోలార్ కంపెనీ అధ్యక్షుడు జీ జియాస్ హర్మన్ ఝా ఏపీలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భేటీల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆఖరి రోజు ఒప్పందాలివే.. ఏపీ ప్రభుత్వం చేసుకున్నవి సోలార్ సెల్, సోలార్ మాడ్యుల్ ఉత్పత్తి చేసే జేఏ సోలార్ ఇన్వెస్ట్మెంట్(హాంగ్‌కాంగ్) లిమిటెడ్ సంస్థతో ఏపీ ప్రభుత్వ ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఒప్పందం చేసుకుంది. సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారు చేసే లె ర్రీ సోలార్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన శాఖ ఒప్పందం. చైనా సోలార్ ఎన ర్జీ లిమిటెడ్‌తో ఏపీ మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన శాఖ ఒప్పందం. షాంఘై న్యూ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఏపీ ఇంధన శాఖ మధ్య ఒప్పందం. ఫోసన్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, పరిశ్రమల శాఖ మధ్య జరిగిన ఒప్పందంలో ఏపీ ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ కార్యదర్శి రావ త్ సంతకం చేశారు ప్రైవేటు రంగంలో... కాకినాడ సెజ్(జీఎమ్మార్), హాంగ్జూ, హౌటాంగ్ మధ్య ఒప్పందం. బాండిక్స్ ఇండియా, జియాంగ్జుకింగ్డే టెక్స్టైల్ కంపెనీ మధ్య ఒప్పందం. టెక్స్టైల్ రంగంలో జియాంగ్ హెంగ్యుయాన్ కెమికల్ ఫైబర్ గ్రూప్‌తో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ మరో ఒప్పందం. కునషాన్ రైజింగ్ టెక్స్టైల్ అండ్ గార్మెంట్ కంపెనీ లిమిటెడ్‌తో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ హోం టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం. సుమెక్ టెక్స్టైల్స్ అండ్ లైట్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్‌తో కూడా బ్రాండిక్స్ ఒప్పందం.