చైనా ప్రధానితో నరేంద్ర మోదీ చర్చలు
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. గురువారం చైనా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి ప్రధాని లి కెక్వియాంగ్ లో విస్తృతచర్చలు జరపనున్నారు. భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య శాంతి సంబంధాల కల్పన ఈ పర్యటనలో భాగమని ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రసిద్ధ బౌద్ధ నిర్మాణం పగోడాను నేడు నరేంద్ర మోదీ సందర్శించనున్నారు.