'చైనాకు వెళ్లి ఆయన సాధించేం లేదు'
హైదరాబాద్ : చైనాకు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాధించేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏదేశంలో కూడా చైనా కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన చెప్పారు. కేసీఆర్ది తుగ్లక్ పాలన అని, రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నప్పటికీ కేంద్రం సాయం కోసం ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ప్రభుత్వం చట్టం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి నెలకొందని, రాష్ట్రానికి పూర్తిస్తాయి ఇంఛార్జ్ కావాలన్నారు. పీసీసీ, సీఎల్పీ కూడా కేడర్తో మమేకమై ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా పోరాడాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పిలుపిచ్చారు.