కేసీఆర్ ఇల్లు మాత్రమే బంగారుమయమే...
సంగారెడ్డి: తెలంగాణ కోసం చాలామంది టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారే తప్ప, కేసీఆర్‌ను చూసి కాదని బీజేపీ నేత, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేసీఆర్..బంగారు తెలంగాణ అని చెప్పారని, అయితే అదెక్కడుందని ప్రశ్నించారు. ముఖ్యమత్రి ఇల్లు మాత్రం బంగారుమయమే అని నందీశ్వర్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ రామరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు.
దేశంలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయిందన్నారు. కాగా నందీశ్వర్ గౌడ్ ఇటీవలే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడంలాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరినట్టు ఆయన చెప్పిన చెప్పుకొచ్చారు.