nandiswar goud
-
పబ్‌లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
కేసీఆర్ ఇల్లు మాత్రమే బంగారుమయమే...
సంగారెడ్డి: తెలంగాణ కోసం చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారే తప్ప, కేసీఆర్‌ను చూసి కాదని బీజేపీ నేత, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేసీఆర్..బంగారు తెలంగాణ అని చెప్పారని, అయితే అదెక్కడుందని ప్రశ్నించారు. ముఖ్యమత్రి ఇల్లు మాత్రం బంగారుమయమే అని నందీశ్వర్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ రామరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకుండా పోయిందన్నారు. కాగా నందీశ్వర్ గౌడ్ ఇటీవలే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడంలాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరినట్టు ఆయన చెప్పిన చెప్పుకొచ్చారు. -
తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు
ఈ నెల 23, 24, 25 తేదీల్లో పర్యటన ఖరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వెల్లడి న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు. మతపర మైన రిజర్వేషన్లను అముల చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాలపై జాతీయ అధ్యక్షుడితో చర్చించామని, దానికి అనుగుణంగా పార్టీ పటిష్టతకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత నందీశ్వర్ గౌడ్.. కాంగ్రెస్ సీనియర్ నేత, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సోమవారం బీజేపీలో చేరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్యణ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడంలాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరిన ట్టు నందీశ్వర్ గౌడ్ తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే విషయంలో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలు చూపుతూ బిల్లును ఆడ్డుకోవడం బాధించిందన్నారు. దేశంలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని భావించి పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు.