చండీయాగానికి కోట్లు ఎక్కడివి : దిగ్విజయ్
హైదరాబాద్: బీజేపీ, ఎంఐఎం రెండూ మతోన్మాద పార్టీలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్... సోనియాకు ధన్యవాదాలు చెప్పి హైదరాబాద్ రాగానే కేసీఆర్ మాట మార్చారని అన్నారు. చండీయాగానికి కోట్ల రూపాయలు ఎక్కడవో చెప్పాలని దిగ్విజయ్ ప్రశ్నించారు. దాతల వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.