
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి? వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులకు వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
దాని ప్రకారం వచ్చే రెండేళ్లలో.. ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతి పెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది.
వచ్చే పదేళ్ల లెక్క తీసుకుంటే.. వాతావరణ మార్పులు, దాని వల్ల కలిగే దుష్ఫలితాలు అతి పెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు.. స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం (inflation) పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడటం లేదని ఈ నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్–10 ముప్పులివీ..

ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్!
Comments
Please login to add a commentAdd a comment