global threat list
-
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి? వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులకు వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే రెండేళ్లలో.. ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతి పెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది.వచ్చే పదేళ్ల లెక్క తీసుకుంటే.. వాతావరణ మార్పులు, దాని వల్ల కలిగే దుష్ఫలితాలు అతి పెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు.. స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం (inflation) పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడటం లేదని ఈ నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్–10 ముప్పులివీ.. ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్! -
భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు
లండన్ : భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల రాజధానులలో ఒకటైన ఇంపాల్, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌పై తీవ్రవాదులు దాడి చేసే అవకశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న వివిధ నగరాల జాబితాను శుక్రవారం లండన్‌లో విశ్లేషకులు విడుదల చేశారు. ఇంపాల్, శ్రీనగర్లకు తీవ్రవాద ముప్పు అధికంగా ఉందని తెలిపారు. విడుదల చేసిన జాబితాలో ఇంపాల్ 32వ స్థానం ... శ్రీనగర్ 49 వ స్థానంలో నిలిచాయన్నారు. అలాగే బెంగుళూరు 204 స్థానం... పుణె, హైదరాబాద్ నగరాలు వరుసగా 206, 207 స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని స్థానాల తేడాతో ముంబై (298), న్యూఢిల్లీ (447) ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే నాగపూర్, కోల్కత్తా నగరాలు 2010, 2012 స్థానంలో ఉన్నాయని చెప్పారు. చెన్నై నగరానికి అయితే తీవ్రవాదుల ముప్పు మధ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1300 నగరాలు, వాణిజ్య కేంద్రాలపై తీవ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించడం..... ప్రజా రవాణ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారని చెప్పారు. అయితే భారత్‌లో 113 నగరాలు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు. అలాగే మధ్య ప్రాచ్య, ఆసియా మరియు యూరప్ దేశాలలో మొత్తం 64 నగరాలకు తీవ్రవాదుల దాడి పొంచి ఉందని చెప్పారు.