భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు | Two Indian cities at high risk of terror strike | Sakshi
Sakshi News home page

భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు

Published Fri, May 22 2015 9:06 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు - Sakshi

భారత్ లో 'ఆ రెండు' నగరాలకు ముప్పు

లండన్ : భారత్లోని ఈశాన్య రాష్ట్రాల రాజధానులలో ఒకటైన ఇంపాల్, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్పై తీవ్రవాదులు దాడి చేసే అవకశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న వివిధ నగరాల జాబితాను శుక్రవారం లండన్లో విశ్లేషకులు విడుదల చేశారు. ఇంపాల్, శ్రీనగర్లకు తీవ్రవాద ముప్పు అధికంగా ఉందని తెలిపారు. విడుదల చేసిన జాబితాలో ఇంపాల్ 32వ స్థానం ... శ్రీనగర్ 49 వ స్థానంలో నిలిచాయన్నారు.

అలాగే బెంగుళూరు 204 స్థానం... పుణె, హైదరాబాద్ నగరాలు వరుసగా 206, 207 స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని స్థానాల తేడాతో ముంబై (298), న్యూఢిల్లీ (447) ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే నాగపూర్, కోల్కత్తా నగరాలు 2010, 2012 స్థానంలో ఉన్నాయని చెప్పారు. చెన్నై నగరానికి అయితే తీవ్రవాదుల ముప్పు మధ్యస్తంగా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 1300 నగరాలు, వాణిజ్య కేంద్రాలపై తీవ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించడం..... ప్రజా రవాణ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారని చెప్పారు. అయితే భారత్లో 113 నగరాలు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు. అలాగే మధ్య ప్రాచ్య, ఆసియా మరియు యూరప్ దేశాలలో మొత్తం 64 నగరాలకు తీవ్రవాదుల దాడి పొంచి ఉందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement