నోరు మూస్కో లేదంటే.. | Mafia Don Ravi Poojary Threatening Shehla Rashid Shora | Sakshi
Sakshi News home page

నోరు మూస్కో లేదంటే..

Published Tue, Aug 14 2018 12:58 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Mafia Don Ravi Poojary Threatening Shehla Rashid Shora - Sakshi

విద్యార్థి కార్యకర్త షహలా రషీద్‌ షోరా(ఫైల్‌ ఫోటో)

శ్రీనగర్‌ : దేశ రాజధానిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్‌ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీనగర్‌కు చెందిన షహలా రషీద్‌ షోరా అనే మహిళా విద్యార్థి కార్యకర్తకు కూడా ఫోన్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. మాఫియా డాన్‌ రవి పూజారి తనను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది. దాంతో తాను రవి పూజారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు అతని మీద కేసు కూడా నమోదు చేశారని తెలిపింది.

వివరాల ప్రకారం రవి పూజారి అనే మాఫియా డాన్‌. విద్యార్థి కార్యకర్త అయిన షహలా రషీద్‌ షోరా ఫోన్‌కు ‘నువ్వు నోరు మూసుకో.. లేకపోతే మేమే శాశ్వతంగా నీ నోటిని మూయిస్తాము. ఇదే విషయాన్ని ఉమర్‌ ఖలీద్‌, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీలకు కూడా చెప్పు. మాఫియా డాన్‌ రవి పూజారి అంటూ సందేశం పంపిచాడు. దాంతో షహలా రషీద్‌ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకా రవి పూజారి పంపిన సందేశాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement