ravi poojary
-
నోరు మూస్కో లేదంటే..
శ్రీనగర్ : దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీనగర్‌కు చెందిన షహలా రషీద్ షోరా అనే మహిళా విద్యార్థి కార్యకర్తకు కూడా ఫోన్లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. మాఫియా డాన్ రవి పూజారి తనను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది. దాంతో తాను రవి పూజారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు అతని మీద కేసు కూడా నమోదు చేశారని తెలిపింది. వివరాల ప్రకారం రవి పూజారి అనే మాఫియా డాన్. విద్యార్థి కార్యకర్త అయిన షహలా రషీద్ షోరా ఫోన్‌కు ‘నువ్వు నోరు మూసుకో.. లేకపోతే మేమే శాశ్వతంగా నీ నోటిని మూయిస్తాము. ఇదే విషయాన్ని ఉమర్ ఖలీద్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీలకు కూడా చెప్పు. మాఫియా డాన్ రవి పూజారి అంటూ సందేశం పంపిచాడు. దాంతో షహలా రషీద్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకా రవి పూజారి పంపిన సందేశాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్లో పోస్టు చేశారు. Meanwhile, got this death threat from right-wing Hindutvawadi fundamentalist Ravi Poojary. He warns Umar Khalid, Jignesh Mevani and me to shut up! Threat by SMS #DigitalIndia pic.twitter.com/NaC0m3nb5M — Shehla Rashid (@Shehla_Rashid) August 13, 2018 -
చంపేస్తామంటూ మంత్రికి మాఫియా బెదిరింపులు
పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు ఈ మధ్య మాఫియా నాయకుడు రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇదే కోవలో కర్ణాటక మంత్రి కె. అభయచంద్ర జైన్‌కు కూడా ఈ బెదిరింపులు రావడంతో ఆయనకు భద్రతను పెంచారు. బజరంగ్ దళ్ కార్యకర్త ప్రశాంత్ పూజారి హత్యతో సంబంధం ఉందంటూ అతడు ఆరోపించాడని, అదుకే తనను చంపేస్తామని ఫోన్లో బెదిరించినట్లు రాష్ట్ర క్రీడలు, మత్స్యశాఖ మంత్రి జైన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు. ఇదే హత్యలో మరో మంత్రి రామనాథ్ రాయ్ హస్తం కూడా ఉన్నట్లు రవిపూజారి మనిషి తనతో ఫోన్లో చెప్పాడని అభయచంద్ర జైన్ అన్నారు. అతడు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడాడని తెలిపారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని సీఎం సిద్దరామయ్యకు, హోం మంత్రి కేజే జార్జికి కూడా చెప్పానన్నారు. పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ మంత్రి ఇంటికి వెళ్లి.. ఆయనకు అదనపు భద్రత కల్పించాలని ఆదేశించారు. అక్రమ కబేళాల గుట్టు రట్టు చేసిన ప్రశాంత్ పూజారి (29)ని బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యచేశారు. యూపీలో దాద్రి హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఈ హత్య జరిగింది. ఈ కేసు విచారణపై కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు.