సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోరమ్ ఆహ్వానించింది. ఈజ్ ఆఫ్ డూరుుంగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం పట్ల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం, కేసీఆర్ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిదర్శనమన్నారు. సీఎంతో పాటు మంత్రివర్గాన్ని అభినందిస్తూ బుధవారం ఆయన సందేశాన్ని పంపారు.