సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పాలసీలో దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ అద్భతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమయిందని తెలిపారు. విజనరీ లీడర్ షిప్ ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేందుకు తెలంగాణే నిదర్శమని అన్నారు.
ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాలు బృహత్తర లక్ష్యం కోసం సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు మరింత సరళతరం కావాల్సిన అవసరముందని సూచించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment