![శ్రమలో మహిళలదే పైచేయి](/styles/webp/s3/article_images/2017/09/4/61477607341_625x300.jpg.webp?itok=T6GueYJc)
శ్రమలో మహిళలదే పైచేయి
భారత్‌లో పురుషుల కన్నా సగటున 50 రోజులు ఎక్కువ పని
లండన్: భారత్‌లో మహిళలు పురుషులకన్నా సగటున ఏడాదికి 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని ప్రపంచ ఆర్థిక ఫోరం ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచం మొత్తంలో చూస్తే ఇది 39 రోజులుగా ఉంది. మహిళలు, పురుషుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగిపోవడానికి 170 ఏళ్లు పడుతుందని ఈ నివేదిక పేర్కొంది.
కేవలం ఆరు దేశాల్లోనే పురుషులు మహిళల కన్నా ఎక్కువ పనిచేస్తారని తెలిపింది. ఆ ఆరింటిలో మూడు దేశాలు స్కాండినేవియా, ఫిన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్. వేతనం లభించే పని వరకే చూస్తే పురుషులే మహిళల కన్నా 34 శాతం ఎక్కువగా కష్టపడుతున్నారు. దీనికి కారణం మహిళలు కార్యాలయాల్లో చేసే పని కన్నా వేతనం రానటువంటి ఇంటిపని, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.