
న్యూఢిల్లీ/దావోస్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌వార్షిక సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.