
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు వివాహం జరగనుంది.