రాష్ట్ర అవతరణ వేడుకలో భాగస్వాములు కావాలని లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ శుక్రవారం కేసీఆర్‌ను కలిశారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి జీఏడీ అధికారులతో కలిసి వెళ్లిన వేణుగోపాల్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌కు రాసిన లేఖను అందజేశారు.
అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం అందరికీ పండుగ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ను కోరాం. ఆయన మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు’అని వెల్లడించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొనేదీ లేనిదీ తెలియదని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment